Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Actress Rama Prabha About Her Financial Status

Rama Prabha: నేను అడుక్కు తింటున్నానా.. ఎవడ్రా చెప్పింది మీకు..?

Published Date :February 3, 2023 , 8:54 pm
By Roja Pantham
Rama Prabha: నేను అడుక్కు తింటున్నానా.. ఎవడ్రా చెప్పింది మీకు..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Rama Prabha: తెలుగు చిత్ర పరిశ్రమ ఉన్నంత వరకు కొంతమంది నటులను తెలుగు అభిమానులు గుండెల్లో పెట్టుకొని ఆదరిస్తారు. ముఖ్యంగా కామెడీ పంచిన కమెడియన్లను అయితే అస్సలు మరువరు. రాజబాబు, అల్లు రామలింగయ్య, రమాప్రభ, బ్రహ్మానందం.. వీరి గురించి ఎప్పుడు మాట్లాడిన పెదాల్లో ఒక చిరునవ్వు వస్తోంది. ఇక ఒకప్పుడు ఎంతో బాగా బతికిన నటులు.. ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఇక ఈ సోషల్ మీడియాలో కొంతమంది నటులు చనిపోయారని, వారి ఆర్థిక పరిస్థితి బాగోలేక సహాయం కోసం ఎదురుచూస్తున్నారు అంటూ వార్తలు వైరల్ గా మారుతూ ఉన్నాయి. ఇక తాజగా కొన్నిరోజుల నుంచి లేడీ కమెడియన్ రమాప్రభ ఆర్థిక సహాయం కోసం ఎదురుచూస్తుంది అని, కొందరి దగ్గర అడుక్కు తింటుందని వార్తలు వచ్చాయి. తాజాగా ఒక యూట్యూబ్ ఛానెల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. నేను అడుక్కు తింటున్నానా.. ఎవడ్రా చెప్పింది మీకు అనే రేంజ్ లో మండిపడింది.

Nandamuri Kalyan Ram: తమ్ముడొస్తున్నాడు.. మాట్లాడుకుందాం

“నా ఆర్థిక పరిస్థితి బాగోలేదు.. కొందరి దగ్గర అడుక్కొని తింటున్నాను.. ఎవరైనా సాయం చేయండి అంటూ నాపై వార్తలు వచ్చాయి. వాటిని నేను కూడా చూసాను.. మొన్నీమధ్యనే నా సొంత యూట్యూబ్ ఛానెల్ లో నా ఇంటిని మొత్తం చూపించాను. ఇంతపెద్ద ఇల్లు పెట్టుకొని ఎవడైన అడుక్కుతింటాడా..? నేను అడుక్కుతింటే.. ఈ ఇల్లు ఎవరిది మరి.. చెప్పండి. ఈ వయస్సులో కూడా నేను బిజీగా పనిచేస్తున్నాను.. ఇండస్ట్రీలో నాగార్జున, పూరి జగన్నాథ్ లాంటివారు సాయం చేస్తున్నారు. అది భిక్ష ఎలా అవుతోంది.. వాళ్ళు నన్ను ఇంటిమనిషిలా చూస్తున్నారు. దాన్ని మీరెలా భిక్ష అంటారు. అది వారి ప్రేమ.. వారేదో భిక్ష వేస్తున్నారని మీరు అనుకుంటున్నారు. మేము అంతా కుటుంబంలా కలిసి ఉన్నామని నేను అంటున్నాను.. నిజం చెప్పాలంటే అందరికంటే నేను రిచ్ గా ఉన్నాను” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Rama Prabha
  • Rama Prabha latest news
  • tollywood comedian Rama Prabha
  • Tollywood News

తాజావార్తలు

  • Healthy Breakfast for Diabetics: మందులు లేకుండానే షుగర్ కంట్రోల్.. పూర్వీకులు తిన్న ఈ ‘ఆహారం’ సింపుల్‌గా ఇలా చేసేయండి!

  • CM Chandrababu: అమరావతి నిర్మాణంలో రాజీ పడొద్దు.. నిర్మాణ సంస్థలకు సీఎం ఆదేశాలు!

  • Ragi Ambali: అమ్మమ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. హాట్ హాట్ వేసవిలో శక్తిని ఇచ్చే హెల్తీ, టేస్టీ రాగి అంబలి!

  • Ranbir Kapoor: రామాయణలో రణబీర్ ‘డబుల్’ ధమాకా.. రాముడితో పాటు ఆ పవర్‌ఫుల్ రోల్‌లోనూ ఆయనే!

  • Rashmika: హిస్టరీ క్రియేట్ చేసిన రష్మిక మందన్న.. వరుసగా రెండోసారి జపాన్ నుంచి పిలుపు!

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions