Site icon NTV Telugu

Namitha Divorce: విడాకుల రూమర్స్‌.. నమిత ఏమన్నారంటే?

Actress Namitha

Actress Namitha

Actress Namitha on Divorce Gossips: 2002లో వచ్చిన ‘సొంతం’ సినిమాతో నమిత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. ఒక రాజు ఒక రాణి, ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి చిత్రాలలో నటించి ప్రేక్షకుల మన్ననల్ని పొందారు. ఆ తరువాత తమిళ, కన్నడ, హిందీలో పలు సినిమాలు చేశారు. సూరత్‌కు చెందిన నమిత.. తమిళ టాప్ చిత్రాల్లోనూ నటించి చెన్నైలోనే సెటిలైపోయారు. ఓ సమయంలో కోలీవుడ్ హాట్ క్వీన్‌గా ఆమె వెలుగొందారు. అయితే తక్కువ కాలంలోనే టాప్ హీరోయిన్‌గా ఎదిగిన నమిత.. బరువు పెరగడంతో క్రమంగా సినిమా అవకాశాలు కోల్పోవాల్సి వచ్చింది.

సినిమా అవకాశాలు తగ్గిన తర్వాత పలు రియాల్టీ షోలలో జడ్జిగా నమిత చేశారు. 2017లో వీరేంద్ర చెలత్రిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2022లో వీరికి కవల పిల్లలు జన్మించారు. ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న నమిత.. బీజేపీ పార్టీలో ఉన్నారు. ఇటీవల ముగిసిన పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ తరపున ఆమె ప్రచారం చేశారు. అయితే విభేదాల కారణంగా నమిత, వీరేంద్ర విడాకులు తీసుకుని విడిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విడాకుల రూమర్స్‌పై నమిత స్వయంగా స్పందించారు.

Also Read: Rajinikanth-Sathyaraj: విభేదాలకు ముగింపు.. కలిసిపోయిన రజనీకాంత్‌, సత్యరాజ్‌!

నా భర్తతో కలిసి ఉన్న చిత్రాలను పోస్ట్ చేసినా విడాకుల రూమర్స్ రావడం బాధాకరం అని నమిత పేర్కొన్నారు. ‘మా విడాకుల పుకార్లు రాకముందే.. నా భర్తతో కలిసి ఉన్న ఫొటోలు పోస్ట్ చేశాను. అయినప్పటికీ మేం విడాకులు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎలాంటి ఆధారాలతో మేం విడిపోయామని ప్రచారం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. నటిగా నేను చాలా రూమర్స్‌ను ఎదుర్కొన్నాను. ఈ విడాకుల రూమర్‌ను నేను, నా భర్త సీరియస్‌గా తీసుకోలేదు. ఈ వార్తలు చూసి మేం నవ్వుకున్నాం’ అని నమిత స్పష్టం చేశారు. తెలుగులో బిల్లా, సింహ లాంటి హిట్ సినిమాల్లో నమిత నటించిన విషయం తెలిసిందే.

Exit mobile version