Site icon NTV Telugu

Keerthy Suresh Marriage: డిసెంబర్‌లోనే నా పెళ్లి: కీర్తి సురేశ్‌

Keerthy Suresh Marriage

Keerthy Suresh Marriage

రెండు రోజుల క్రితం స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌ తనకు కాబోయేవాడిని పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఈరోజు తాను వచ్చే నెలలోనే వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నట్లు తెలిపారు. తిరుమల సన్నిధిలో కీర్తి ఈ విషయాన్ని వెల్లడించారు. కీర్తి తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనంలో తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆమెకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం చేసి.. స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

శ్రీవారిని దర్శించుకున్న అనంతరం కీర్తి సురేశ్‌ మీడియాతో మాట్లాడుతూ… ‘వచ్చే నెలలోనే నేను పెళ్లి చేసుకోబోతున్నా. గోవాలో వెడ్డింగ్‌ జరుగుతుంది. నేను చేసిన హిందీ సినిమా బేబీ జాన్‌ కూడా వచ్చే నెలలో విడుదల కానుంది. అందుకే స్వామివారి దర్శనం కోసం తిరుమల వచ్చాను’ అని తెలిపారు. ఆంటోని తట్టిళ్‌తో తాను 15 ఏ‍ళ్లుగా ప్రేమలో ఉన్నట్లు ఇటీవల కీర్తి చెప్పారు. దీపావళి వేడుకల్లో భాగంగా ఆంటోనీతో కలిసి దిగిన ఫొటోని కీర్తి తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇక డిసెంబరు 11, 12 తేదీల్లో గోవాలోని ఓ రిసార్ట్‌లో పెళ్లి వేడుక జరగనున్నట్లు తెలుస్తోంది.

Also Read: Pushpa 2: చిత్తూరులో కాదు.. హైదరాబాద్‌లోనే ‘పుష్ప’ ప్రీ-రిలీజ్ ఈవెంట్?

కీర్తి సురేశ్‌ తన పెళ్లికి సంబందించిన పనులను ప్రారంభించారట. కీలక పనులకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఇక మలయాళ నిర్మాత సురేశ్, నటి మేనకల కూతురై కీర్తి. బాలనటిగా చేసిన ఆమె.. మలయాళీ సినిమా గీతాంజలితో నటిగా ఎంట్రీ ఇచ్చారు. నేను శైలజతో తెలుగు తెరకు పరిచయమై.. మహానటి సినిమాతో స్టార్ అయ్యారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళం, హిందీలో సినిమాలు చేస్తున్నారు. రివాల్వర్‌ రీటా, బేబీ జాన్‌ చిత్రాల షూట్‌లతో బిజీగా ఉన్నారు.

Exit mobile version