Site icon NTV Telugu

Kangana Ranaut: కంగనా రనౌత్ ఇంట్లో తీవ్ర విషాధం..

Kangana

Kangana

బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇంటి నుంచి ఓ విషాధ వార్త బయటకు వచ్చింది. ఆమె అమ్మమ్మ ఇంద్రాణి ఠాకూర్ కన్నుమూశారు. ఈ విషయాన్ని కంగనా తెలియజేశారు. తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో తన అమ్మమ్మతో కలిసి ఉన్న కొన్ని చిత్రాలను పంచుకున్నారు. నవంబర్ 8వ తేదీ శుక్రవారం రాత్రి కంగనా రనౌత్ అమ్మమ్మ మరణించినట్లు అందులో పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆమె శనివారం తన అభిమానులకు తెలియజేశారు. కొన్ని రోజుల క్రితం తన అమ్మమ్మకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని రాసుకొచ్చారు.

READ MORE: Trump Effect: ట్రంప్ ఎఫెక్ట్ స్టార్ట్.. ఖతార్ నుంచి హమాస్ బహిష్కరణ..

కంగనా రనౌత్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన మొదటి కథనంలో ఆమె తన అమ్మమ్మతో కలిసి బిగ్గరగా నవ్వుతూ కనిపించారు. “నిన్న రాత్రి మా అమ్మమ్మ ఇంద్రాణి ఠాకూర్ జీ మరణించారు. కుటుంబం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. దయచేసి వారి కోసం ప్రార్థించండి. ” అని ఆమె రాసుకొచ్చారు.

READ MORE:Kishan Reddy: సీఎం చేయాల్సింది మూసీ యాత్ర కాదు.. కల్లాల్లో పర్యటించాలి

కంగనా రనౌత్ తన అమ్మమ్మతో మరొక చిత్రాన్ని పంచుకున్నారు. “అమ్మమ్మ అద్భుతమైన మహిళ. ఆమెకు 5 మంది పిల్లలు ఉన్నారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా.. ఆమె తన పిల్లలందరికీ మంచి విద్యాసంస్థల్లో ఉన్నత విద్యను అందేలా చూశారు. పెళ్లయిన తర్వాత తన కుమార్తెలు పని చేయాలని వారి స్వంత వృత్తిని కలిగి ఉండాలని ఆమె సూచించారు. కుమార్తెలకు కూడా ప్రభుత్వ ఉద్యోగాలు లభించాయి. ఇది ఆ రోజుల్లో అరుదైన విజయం. ఆడవారితో సహా ఆమె 5 మంది పిల్లలకు ఇప్పుడు మంచిగా స్థిరపడ్డారు. ఆమె తన పిల్లల కెరీర్‌ల గురించి చాలా గర్వంగా ఫీల్ అయ్యేవారు. ” అని నటి పేర్కొన్నారు. తన అమ్మమ్మ వయస్సు 100 ఏళ్లు దాటిందని బ్రెయిన్ స్ట్రోక్ తో చనిపోయినట్లు తెలిపారు.

Exit mobile version