Veteran Actress Jamuna: తెలుగునాట మేటినాయికగా రాణించిన జమున హిందీ చిత్రసీమలోనూ తనదైన బాణీ పలికించారు. తెలుగులో విజయాసంస్థ నిర్మించిన ‘మిస్సమ్మ’లో సావిత్రి చెల్లెలుగా జమున నటించారు. అదే పాత్రను తమిళంలోనూ జమున పోషించారు. హిందీలో ‘మిస్ మేరీ’గా మీనాకుమారితో తెరకెక్కించగా, అందులోనూ జమున తన పాత్రలో తానే నటించారు. ఇలా మూడు భాషల్లోనూ జమున నటించి మెప్పించారు.
Jamuna: అగ్రనటులతో విభేదం – వాస్తవాలు!
ఆ తరువాత “ఏక్ రాజ్ (1963), హమ్ రాహి (1963), బేటీ బేటే (1964), రిస్తే నాటే (1965), మిలన్ (1967)” చిత్రాలలో జమున నటించి ఆకట్టుకున్నారు. తెలుగులో ఏయన్నార్ తోకలసి జమున నటించిన సూపర్ హిట్ మూవీ ‘మూగమనసులు’ ఆధారంగానే హిందీలో ‘మిలన్’ తెరకెక్కించారు. తెలుగులో పోషించిన పాత్రనే హిందీలోనూ జమున ధరించారు. రంగుల్లో రూపొందిన ‘మిలన్’ అప్పట్లో ఉత్తరాదని సైతం విజయఢంకా మోగించింది. ఈ సినిమాలో జమున అభినయానికి గాను ‘బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్’గా ఫిలిమ్ ఫేర్ అవార్డు లభించింది.
