Ileana D’Cruz: ఇదివరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉన్న ఇలియానా రెండోసారి తల్లి కాబోతుంది. తాజగా ఆమె తన పెరుగుతున్న బేబీ బంప్‌ను అభిమానులతో పంచుకుంటూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక బ్లాక్ అండ్ వైట్ ఫోటోను పోస్ట్ చేశారు. అందులో ఆమె మరో గర్భవతైన స్నేహితురాలితో కలిసి నవ్వుతూ నిలబడి ఉన్నారు. ఇద్దరూ తమ బేబీ బంప్‌లను గర్వంగా చూపిస్తూ పోజులిచ్చారు. ఇలియానా నలుపు రంగు దుస్తులు ధరించగా, ఆమె స్నేహితురాలు లైట్ కలర్ డ్రెస్సులో మెరిసింది. ఈ ఫోటోకు ఆమె “Bump buddies” అని క్యాప్షన్ ఇచ్చారు.
Read Also: Rajnath Singh: ఏదో ఒకరోజు POKను భారత్‌లో కలిపేస్తాం.. రాజ్‌నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు..!
ఇలియానా జనవరిలో తన అభిమానులకు హ్యాపీ న్యూ ఇయర్ చెబుతూ ఓ వీడియో పోస్ట్ చేశారు. అప్పుడే ఆమె మళ్లీ గర్భవతేనా అనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఫిబ్రవరిలో ఆమె దీనిని సరదాగా ధృవీకరించారు. ఒక మిడ్‌నైట్ స్నాక్, యాంటాసిడ్ ఫోటోను పోస్ట్ చేసింది. ఇలియానా 2023లో మైఖేల్ డోలన్‌ను పెళ్లి చేసుకున్నారు. అదే సంవత్సరంలో ఏప్రిల్‌లో ఆమె తన మొదటి గర్భధారణను ప్రకటించారు. ఆ తర్వాత ఆగస్టులో ఆమె కుమారుడి పుట్టిన వార్తను పంచుకుంది.
ఇలియానా చివరిసారిగా షీర్షా గుహా ఠాకుర్తా దర్శకత్వంలో వచ్చిన రొమాంటిక్ కామెడీ డ్రామా ‘డో ఔర్ డో ప్యార్’ చిత్రంలో నటించారు. ఈ సినిమాలో ఆమెతో పాటు విద్యా బాలన్, ప్రతీక్ గాంధీ, సెందిల్ రామమూర్తి ముఖ్య పాత్రల్లో కనిపించారు. 2006లో ‘దేవదాస్’ సినిమాతో కెరీర్ ప్రారంభించిన ఇలియానా.. ఆ తరవాత పోకిరి, జల్సా, కిక్, జులాయి వంటి హిట్లతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్నారు. తమిళంలోనూ ఆమె నటించారు. 2012లో హిందీ సినిమాల్లోకి అడుగుపెట్టి బర్ఫీ, మెయిన్ తేరా హీరో, ‘రుస్తమ్, రెయిడ్ లాంటి సినిమాలతో బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందారు.
