Eesha Rebba: సోషల్ మీడియా యుగంలో సెలబ్రిటీలకు ఆన్‌లైన్ హరాస్‌మెంట్ మితిమీరిపోయింది. అయితే తాజాగా టాలీవుడ్ హీరోయిన్ ఈషారెబ్బ ఈ సమస్యను ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌ల కింద అసభ్యకరమైన కామెంట్లు పెట్టిన ఒక వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఘటన గురించి సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫోటోలు, వీడియోలకు సంబంధించి ఒకరు అత్యంత అసభ్యంగా, అనైతికంగా కామెంట్లు చేస్తున్నారని ఈశా రెబ్బా పోలీసులకు కంప్లైంట్ చేశారు. కామెంట్ చేసిన వ్యక్తి ఇన్స్టా ఐడీ వివరాలు, అతను చేసిన కామెంట్స్ స్క్రీన్ షాట్స్‌ను ఫిర్యాదుతో పాటు జతచేసి ఇచ్చారు.
READ ALSO: Turkish Airlines: నేపాల్-ఇస్తాంబుల్ విమాన ఇంజిన్‌లో మంటలు.. చివరకు
ఈషారెబ్బ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఆమెకు సోషల్ మీడియా వేదికగా అభిమానులు, నెటిజన్లు మద్దతుగా నిలుస్తున్నారు. ఇక తన కెరీర్ విషయానికి వస్తే.. ఇటీవలే ఆమె హీరోయిన్‌గా నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. మలయాళంలో చిన్న సినిమాగా రిలీజ్ అయి సూపర్ హిట్‌గా నిలిచిన ‘జయ జయ జయ జయ హే’ సినిమాని తెలుగులో ‘ఓం శాంతి శాంతి శాంతిః’ పేరుతో రీమేక్ చేశారు. ఈ సినిమాలో తరుణ్ భాస్కర్ హీరోగా, ఈషా రెబ్బా హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రాన్ని ’35 చిన్న కథ కాదు’ నిర్మాత సృజన్ తన స్నేహితులతో కలిసి నిర్మించారు.
READ ALSO: Nelson Dilipkumar: పూనకాలు తెప్పించే మెగా మల్టీస్టారర్.. 46 ఏళ్ల తర్వాత ఒకే ఫ్రేమ్‌లో రజనీ-కమల్!
