Site icon NTV Telugu

Dimple Hayathi: ఆ విషయంలో ఆడవాళ్లు తక్కువేం కాదు.. డింపుల్ హయతి షాకింగ్ కామెంట్స్

dimple hayathi

dimple hayathi

Dimple Hayathi: గల్ఫ్ సినిమాతో తెరంగేట్రం చేసి.. గద్దలకొండ గణేష్ సినిమాలో స్పెషల్ సాంగుతో ప్రేక్షకుల గుండెలను కొల్లగొట్టింది డింపుల్ హయతి. ఆ తర్వాత రవితేజతో ఖిలాడీ సినిమాలో తనదైన నటన అందచందాలతో అదరగొట్టింది. తన నడుం ఒంపులతో కుర్రకారుకి కిక్కెక్కించారు. సామాన్యుడు, అభినేత్రి 2వంటి సినిమాల్లో నటించిన డస్కీ బ్యూటీ అవకాశాలను అందుకోవడంలో కాస్తంత స్లో అయ్యారు. తాజాగా డింపుల్ హయతి ఆడవాళ్లను ఉద్దేశించి షాకింగ్ కామెంట్ చేశారు. సినిమా, సమాజాన్ని మిళితం చేస్తూ ఆమె చేసిన కామెంట్లు జనాలను ఆలోచనలో పడేలా చేశాయి.

Read Also: Vishnu priya: కేటుగాళ్ల పనికి దయనీయంగా మారిన యాంకర్ విష్ణుప్రియ పరిస్థితి

సినిమాలో మహిళల క్యారెక్టర్ల గురించి, వాళ్లు చేస్తున్న పాత్రలకు ప్రాధాన్యతనివ్వట్లేదని బహిరంగంగా చెప్పిన వాళ్లు చాలా తక్కువ. తెరపై ఆడవాళ్లను చూపిస్తున్న విధానం మారాలన్నారు. ఇప్పుడు ఇవే వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. సినిమాల్లో అమ్మాయిల కోసం మగాళ్లు పడే పాట్లను సహజంగా చూపిస్తుంటారు. ఈ విషయంలో దర్శకనిర్మాతల పద్ధతి మారాలి.. వాళ్లు ఆలోచించే విధానంలో మార్పు రావాలి.. మూవీస్‌లో ఎక్కువగా మగాళ్ల ప్రేమను హైలెట్ చేస్తూ.. మహిళల పాత్రలను బలంగా రాయట్లేదు.. ముఖ్యంగా ప్రేమను చూపించడంలో ఆడాళ్లు తక్కువేంకాదని చూపించాలని వ్యాఖ్యానించారు. మరి డింపుల్ వ్యాఖ్యలకు దర్శక నిర్మాతలు ఏ మేరకు స్పందిస్తారో.. సినిమా తీసే విధానం, ఆమె మాటను అమలు చేస్తారేమో చూడాలి.

Exit mobile version