Euphoria: విభిన్న కథలతో సినిమాలను తెరకెక్కించే దర్శకుడు గుణశేఖర్. ప్రస్తుతం ఆయన ‘యుఫోరియా’ అనే డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. తాజాగా హైదరాబాదులో సినిమాకు సంబంధించిన పాటను విడుదల చేశారు. రామ రామ అనే పాటను చిత్ర బంధం విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన లాంచ్ ఈవెంట్లో భాగంగా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత సీనియర్ నటి భూమిక చావ్లా ఈ సినిమాలో ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమాకు సంబంధించి ఇదివరకు విడుదలైన పోస్టర్, ‘హై ఫ్లై’ అనే పాట ప్రేక్షకల్లో మంచి బజ్ తీసుకువచ్చాయి.
Read Also: Srisailam Temple: శ్రీశైల దేవస్థానంలోని ఇద్దరు శాశ్వత ఉద్యోగులు సస్పెన్షన్
ఈ కార్యక్రమానికి హాజరైన సీనియర్ నటి భూమిక మాట్లాడుతూ.. ఈ సినిమా తన హృదయానికి ఎంతో దగ్గరైన సినిమా అని తెలిపారు. తనకు 11 ఏళ్ల కొడుకు ఉన్నాడని.. ఈ సినిమాలో నటించిన విగ్నేష్ తో ఎక్కువగా సెట్టులో ఉన్నప్పుడు మా అబ్బాయితో ఉన్నట్లే అనిపించిందని తెలిపారు. తను బాగా నటించాడని, అతడికి మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. తాజాగా విడుదలైన ‘రామ రామ’ సాంగ్ సినిమాకి ఎంతో ప్లస్ అవుతుందని.. ఆ పాట తనకు ఎంతో నచ్చిందని తెలిపారు. కాలభైరవ సినిమాకి మంచి సంగీతాన్ని అందించారని ఈ సినిమా మనపై ఎంతో ఇంపాక్ట్ చూపిస్తుందని ఆవిడ తెలిపారు. ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ సినిమా తప్పకుండా చూడాల్సిందేనని ఆవిడ పేర్కొంది.
Read Also:Euphoria: 20 మంది కొత్త వారిని పరిచయం చేశా.. సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో డైరెక్టర్..!
అలాగే, నటుడు విగ్నేష్ మాట్లాడుతూ.. ఈ సినిమా అందరూ చూడాల్సిన సినిమా అని, ప్రేక్షకులు సమయానికి డబ్బుకి విలువ ఇచ్చే సినిమా అంటూ పేర్కొన్నాడు. ఈ సినిమాలో భూమిక తనకెంతో కంఫర్ట్ జోన్ ఇచ్చారని ఆమెకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసాడు. ఈ సినిమాలో ఆమె కొడుకుగా తాను నటించానని.. తనతోపాటు కొత్త ఆర్టిస్టులను టెక్నీషియన్లను పరిచయం చేసినందుకు డైరెక్టర్ గుణశేఖర్ కి థాంక్స్ తెలిపాడు. తామందరము నిజాయితీగా చేసిన సినిమా ఇది.. అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానని అన్నారు.
