Site icon NTV Telugu

Tammareddy : సీనియర్లు మాటలు వినే పరిస్థితి లేదు.. కుర్ర హీరోలకు కోటరీలు ఉంటున్నాయి

New Project 2024 12 28t140524.044

New Project 2024 12 28t140524.044

Tammareddy: సినిమా వాళ్లకు సామాజిక బాధ్యత అవసరమని ఫిల్మ్ ఛాంబర్ మాజీ అధ్యక్షుడు, నిర్మాత, దర్శకుడు తమ్మారెడ్డి భరద్వాజ తెలిపారు. చిత్రపరిశ్రమలో చోటు చేసుకున్న తాజా పరిణామాలపై ఆయన మీడియాతో ముచ్చటించారు. ప్రభుత్వం చేపట్టే అవగాహన కార్యక్రమాల గురించి నటీనటులందరూ వీడియోలు చేయాలని సూచించారు. తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖుల తో సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశానికి తాను వెళ్లలేదని, అయితే ఆ సమావేశం బాగా జరిగిందన్నారు. మంచి సమావేశమని వెళ్లిన వాళ్లు చెప్పారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంతో సినీ ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి మధ్య ఉన్న అపోహలు తొలగిపోయినట్లేనన్నారు. ప్రభుత్వం చేపట్టే సామాజిక చైతన్య కార్యక్రమాలపై నటీనటులు అంతా వీడియోలు చేయాలన్నారు.

Read Also:Deputy CM Pawan Kalyan: అధికారులపై దాడి చేయడం వైసీపీకి కొత్త కాదు..

సీఎం తో జరిగిన సమావేశం ప్రభుత్వం పిలిచిన మీటింగ్ కాదని అనుకుంటున్నాను అన్నారు తమ్మారెడ్డి. ఆ మీటింగుకు తనకు ఆహ్వానం అందలేదన్నారు. వ్యక్తిగతంగా కొంతమంది కలిశారు. అది ఛాంబర్ సమావేశం కాదని తెలిసిందన్నారు. ఇండస్ట్రీ అంటే ఛాంబర్ ఒక్కటే.. అన్ని సెక్టార్స్ కలిపితేనే ఇండస్ట్రీ.. ఇవన్నీ ఛాంబర్ కిందే ఉంటాయని తమ్మారెడ్డి స్పష్టం చేశారు.
ఎఫ్ డీసీ చైర్మన్ గారిని పిలవడంతో ఆయన కొంతమందిని తీసుకెళ్లారు. పుష్ప 2 తో ఏర్పడిన గ్యాప్ పోయింది. అల్లు అర్జున్ ఇష్యూ సెట్ అయిపోయింది. సినిమాలు తీసే నిర్మాతల సమస్యలు వాటి పరిష్కారం నిమిత్తం వెళ్లారు.

Read Also:Formula E Car Race Case: ఫార్ములా ఈ రేసింగ్ కేసులో వివరాలను ఈడీకి అందజేసిన ఏసీబీ..

బెనిఫిట్ షో వద్దని నేను చెప్తూనే ఉన్నా.. ప్రేమియర్స్ వేసుకోవచ్చు కానీ, బెనిఫిట్స్ వద్దు. టికెట్ రేట్ కోసం సీఎం దగ్గరికి వెళ్లి దేహి అని అడుక్కోవడం కరెక్ట్ కాదన్నారు తమ్మారెడ్డి. టాలీవుడ్ ఆల్రెడీ వరల్డ్ రికార్డ్స్ లోకి వెళ్లిపోయింది. మన దగ్గర అన్ని భాషల సినిమాలు షూటింగ్ జరుగుతున్నాయి. ఎఫ్ డీసీ పని జనాలను కో ఆర్డినేట్ చేయడమేనన్నారు. గతంలో అల్లు అర్జున్, సుకుమార్ ఒక సామాజిక చిత్రం చేశారు, ఎన్టీఆర్, చిరంజీవి గారు కూడా చేశారు. సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకు సినిమా వాళ్ల మద్దతు ఉండాలి. సినిమా రిలీజ్ అప్పుడు కాకుండా అవసరం ఉన్నప్పుడు చేయాలి. 2025లో గద్దర్ అవార్డ్స్ ఇస్తారు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ఇక్కడ పెట్టాలంటే ఆఫీస్ లు హైదరాబాద్ లో ఉండాలన్నారు. పిల్లలు తప్పు చేస్తే ఎలా జాగ్రత్తలు చెప్తామో అలాగే అల్లు అర్జున్ కి చెప్పా.. మా పిల్లలు ఫోన్ ఎత్తరు కాబట్టే వీడియో రిలీజ్ చేసి చెప్పాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడున్న కుర్ర హీరోలు ఎదిగిపోయాక వాళ్ళ చుట్టూ కోటరీలు ఉంటాయి. వాళ్ళు సీనియర్స్ మాటలు వినే పరిస్థితి లేదు. ఆ పద్ధతి మారాలని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు.

Exit mobile version