RGV: టీవీకే విజయ్ గెలుపుపై.. ఆర్జీవీ సంచలన కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు మార్మోగుతోంది, అదే ‘దళపతి’ విజయ్. తన కొత్త పార్టీ తమిళగ వెట్రి కజగం (TVK) ద్వారా ఆయన సృష్టించిన సంచలనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దాదాపు 62 ఏళ్లుగా తమిళ రాజకీయాలను శాసిస్తున్న ద్రావిడ దిగ్గజాలు DMK మరియు AIADMKల ద్వంద్వాధిపత్యానికి విజయ్ బ్రేక్ వేశారు. ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ అతిపెద్ద శక్తిగా అవతరించినప్పటికీ, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మరో 10 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరమవుతోంది. ప్రస్తుతం అందరి దృష్టి ఈ సంఖ్యాబలం, పొత్తుల సమీకరణాలపైనే ఉంది.
వైరల్ అవుతున్న ఆ పాత చిత్రం..
ఈ రాజకీయ ప్రకంపనల మధ్య.. విజయ్, దివంగత మాజీ ముఖ్యమంత్రి DMK దిగ్గజం కరుణానిధి కలిసి ఉన్న ఒక పాత ఫోటో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో కరుణానిధి ఒక కార్యక్రమానికి సంబంధించి రిబ్బన్ కట్ చేస్తున్నారు. ఆయన వెనుక ఒక సాధారణ యువకుడిలా విజయ్ వినయంగా నిలబడి ఉన్నారు.
Also Read
రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు..
ఈ ఫోటోను ఎక్స్ వేదికగా ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పంచుకుంటూ.. తనదైన శైలిలో స్పందించారు. ‘తన వెనుక నిలబడిన ఆ పిల్లాడు, ఒకరోజు తన పార్టీనే తుడిచిపెట్టేస్తాడని కలైంజ్ఞర్ (కరుణానిధి) కలలో కూడా ఊహించి ఉండరు’ అంటూ ఆర్జీవీ రాసుకొచ్చారు.
Kalaingar wouldn’t have dreamed that the kid behind him would one day destroy his party 🙏👍🔥 pic.twitter.com/7NNp6Ge73S
— Ram Gopal Varma (@RGVzoomin) May 5, 2026
కరుణానిధి మరణానంతరం ఆయన కుమారుడు ఎం.కె. స్టాలిన్ నేతృత్వంలో కొనసాగుతున్న DMKకు విజయ్ రూపంలో ఊహించని దెబ్బ తగలడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ పరిణామం తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకానికి ఆరంభమని విశ్లేషకులు భావిస్తున్నారు.
తాజావార్తలు
-
Varun Tej : చరణ్ అన్నతో స్క్రీన్ షేర్ చేసుకోవాలనుంది.. మనసులో మాట బయటపెట్టిన వరుణ్ తేజ్!
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
Economic D-Day: ఇరాన్‌కు ఆర్థిక సాయం చేస్తే భారీ మూల్యం తప్పదు.. దేశాలకు ట్రంప్ ‘ఎకనామిక్ డీ-డే’ హెచ్చరిక
-
Uber Expands: ఇక బైక్ ఎక్కేయ్ బాస్.. తెలంగాణలోని ఈ జిల్లాల్లోనూ ఉబర్ సేవలు..
-
Heavy Rain Alert: ఆగస్టు 24 వరకు భారీ వర్షాలు.. హిమాలయాల నుంచి మధ్య భారతం వరకు హై అలర్ట్!
ట్రెండింగ్
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!