NTV Telugu Site icon

Sarathbabu : శరత్ బాబుకు తలకొరివి పెట్టేది ఎవరో తెలుసా ?

Rajinikanth, Sarath Babu

Rajinikanth, Sarath Babu

Sarathbabu : సీనియర్ నటుడు శరత్ బాబు అనారోగ్యంతో మే 22న కన్నమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణ వార్త విని సినీ ఇండస్ట్రీ విషాదంలో మునిగిపోయింది. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధి కారణంగా ఆనారోగ్యంతో.. హైదరాబాదులోని ఏఐజి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. అయితే ఇటీవల ఆయన అవయవాలు చెడిపోవడంతో సోమవారం ఆయన చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ సినీ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో సంతాపం తెలియజేస్తున్నారు. ఇదిలా ఉండగా మే 23న ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగనున్నాయి. ఆయనకు తలకొరివి పెట్టేది ఎవరనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ అయింది.

Read Also:Rahul Gandhi : లారీ ఎక్కిన రాహుల్ గాంధీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

శరత్ బాబు ఆర్థికంగా కష్టాల్లో ఉన్నప్పుడు అప్పటికే స్టార్ లేడీ కమెడియన్ గా పేరు తెచ్చుకున్న రమప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. దాదాపు వారిద్దరూ 14ఏళ్ల పాటు కలిసి ఉన్నారు. అయితే ఈ దంపతులకు పిల్లలు లేరు. ఇక శరత్ బాబు ఆస్తి విషయంలో తనను మోసం చేశాడు అని రమాప్రభ అతడికి విడాకులు ఇచ్చింది. తర్వాత నంబియార్ కూతురు స్నేహ నంబియార్ ను వివాహం చేసుకున్నారు. ఆమెతో కూడా ఎక్కువ కాలం జీవించలేక 2011లో విడాకులు తీసుకున్నాడు. ఇకపోతే ఆయనకు సంతానం కలగలేదు. మూడో పెళ్లి చేసుకోవాలనుకున్నాడు కానీ చేసుకోలేకపోయారు. వారసులు లేకుండా ఆయనకు ఇప్పుడు తలకొరివి ఎవరు పెడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. వాస్తవానికి శరత్ బాబు కుటుంబం చాలా పెద్దది.. ఏడుగురు అన్నదమ్ములు , అయిదుగురు అక్క చెల్లెలు.. వారి పిల్లలే సుమారుగా 25 మంది దాకా ఉన్నారు. ఇకపోతే ఈరోజు చెన్నైలో ఆయన అంత్యక్రియలను కుటుంబ సభ్యులు జరపనున్నారు. ఇక ఈ క్రమంలోనే తమ కుటుంబంలోని పిల్లల్లో ఎవరో ఒకరి చేత ఆయనకు తలకొరివి పెట్టించనున్నారట. ఇప్పటికే ఆముదాల వలస, ఇతర ప్రాంతాల నుంచి బంధువులు , కుటుంబ సభ్యులు, స్నేహితులు చేరుకున్నారు. ఇక ఈరోజు మధ్యాహ్నం శరత్ బాబు అంత్యక్రియలు జరగనున్నాయి.

Read Also:Ajith : అజిత్ కొత్త వ్యాపారం.. ఆల్ ది బెస్ట్ చెబుతున్న ఫ్యాన్స్

ఇది ఇలా ఉండగా.. చెన్నైలోని త్యాగరాయనగర్‌లో శరత్ బాబు నివాసానికి చేరుకున్నారు. అనంతరం శరత్‌బాబు భౌతికకాయం వద్ద పుష్పాంజలి ఘటించారు. ఆయనతో తనకున్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. అనతరం మీడియాతో మాట్లాడుతూ.. మంచిమిత్రుడిని కోల్పోయానని చెప్పారు. నటుడు కాకముందే ఆయనతో తనకు పరిచయం ఉందని తెలిపారు. శరత్‌బాబు తనకు అత్యంత సన్నిహితుడని, తనపట్ల ఆప్యాయంగా ఉండేవారని చెప్పారు. ఆయన కోపంగా ఉండటం తానెప్పుడూ చూడలేదన్నారు. ఆయన నటించిన సినిమాలన్నీ పెద్ద హిట్‌ అయ్యాయని చెప్పారు. ఆయన మృతి తనను కలచివేసిందన్నారు. ముత్తూ, అన్నామలై సహా చాలా సినిమాలో తామిద్దరం కలిసి నటించామని తెలిపారు. సిగరెట్లు తాగొద్దని తనను వారించేవాడని, ఆరోగ్యంగా ఉండాలని చాలాసార్లు చెప్పారని గుర్తుచేసుకున్నారు.

Show comments