Big Breaking : విశ్వ నటుడు కమల్ హాసన్ తీవ్ర అస్వస్థతతో చెన్నైలోని హాస్పత్రిలో చేరారు. తీవ్రమైన జ్వరంతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది రావడంతో కమల్ చెన్నైలోని పోరూరు హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. కాగా పోస్ట్ కోవిడ్ లక్షణాలు అయి ఉంటాయని అందుకే ఆయనకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తినట్లు సమాచారం. తమ అభిమాన నటుడు ఆస్పత్రిలో చేరాడన్న విషయం తెలియగానే ఆయన అభిమానులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే భారీగా అభిమానులు హాస్పిటల్ కు చేరుకుంటున్నారు.ఇదిలా ఉండగా అన్ని పరీక్షలు చేసిన అనంతరం రెండు రోజుల పాటు విశ్రాంతి తీసుకోవాలని కమల్ కు వైద్యులు సూచించారు. అనంతరం ఆయన్ని డిశ్చార్జ్ చేశారు.
Read Also: Fake News : విక్రమ్ చనిపోయాడంటూ ప్రచారం.. కాదంటున్న కుటుంబ సభ్యులు
తాజాగా విక్రమ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు కమల్‌హాసన్. ఇటీవలే ఆయన కళాతపస్వి కే విశ్వనాథ్ ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. కమల్ హాసన్ వీల్‌ఛైర్‌లో ఉన్న కే విశ్వనాథ్ చేయి పట్టుకుని ఆత్మీయంగా పలుకరిస్తున్న ఫొటో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. కే విశ్వనాథ్, కమల్‌హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన సాగర సంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమలో మరుపురాని ఆణిముత్యాల జాబితా టాప్‌లో ఉంటాయి. ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2(Indian 2)లో నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 కొత్త షెడ్యూల్ వచ్చే నెలలో ప్రారంభం కానుంది. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్‌సింగ్, సిద్దార్థ్, బాబీ సింహా, సముద్రఖని కీలక భూమికలను పోషిస్తున్నారు.
