Site icon NTV Telugu

Jayaram : ‘అల వైకుంఠపురములో’ షూటింగ్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ బయటపెట్టిన జయరామ్

Iayaram Allu Arjun

Iayaram Allu Arjun

మలయాళ సీనియర్ నటుడు జయరామ్ ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ సపోర్టింగ్ యాక్టర్‌గా మారిపోయారు. ‘భాగమతి’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన, ఆ తర్వాత వరుసగా పెద్ద సినిమాల్లో నటిస్తూ ఆకట్టుకుంటున్నారు. అయితే, తెలుగులో ఆయనకు గుర్తింపు తెచ్చిన చిత్రాల్లో ‘అల వైకుంఠపురములో’ ఒకటి. ఇందులో అల్లు అర్జున్‌కు తండ్రిగా ఆయన అద్భుతమైన నటన కనబరిచారు. తాజాగా ఒక మలయాళ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఒక కామెడీ ఇన్సిడెంట్‌ను ఆయన గుర్తుచేసుకున్నారు.

Also Read : Tamannaah : బ్రేకప్ తర్వాత తమన్నా తీసుకున్న సాహసోపేత నిర్ణయం..

జయరామ్ మాట్లాడుతూ.. ‘నాకు తెలుగు భాష రాదు. ఎన్నిసార్లు చదివినా డైలాగులు అస్సలు గుర్తుండేవి కావు. ఒక సీన్‌లో అల్లు అర్జున్ ఎదురుగా ఉండి నేను డైలాగ్ చెప్పాలి. కానీ ఎన్ని టేకులు తీసుకున్నా డైలాగ్ రావడం లేదు. అప్పుడు ఒక ఐడియా వేశాను. డైలాగ్‌ను ఒక కాగితంపై రాసి, దాన్ని అల్లు అర్జున్ నుదురు, ఛాతీపై అంటించమని అడిగాను. బన్నీ కూడా దానికి నవ్వుతూ అంగీకరించారు. అలా ఆయన ముఖంపై ఉన్న కాగితాన్ని చూస్తూ నేను డైలాగులు పూర్తి చేశాను’ అని చెప్పుకొచ్చారు.

సాధారణంగా నటీనటులు ప్రాంప్టింగ్ తీసుకుంటారు, కానీ జయరామ్ ఇలా ఏకంగా హీరో నుదురునే బోర్డులా వాడుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఈ ఘటన అల్లు అర్జున్‌కు ఉన్న సహనానికి, జయరామ్ డెడికేషన్‌కు నిదర్శనమని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. జయరామ్ ప్రస్తుతం రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, తేజ సజ్జా ‘మిరాయ్’ వంటి భారీ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Exit mobile version