NTV Telugu Site icon

Guntur Kaaram: ‘గుంటూరు కారం’ను ఎంజాయ్‌ చేయలేకపోయా: జగపతి బాబు

Jagapathi Babu

Jagapathi Babu

Jagapathi Babu on Mahesh Babu’s Guntur Kaaram: ‘సూపర్ స్టార్’ మహేశ్‌ బాబు నటించిన ‘గుంటూరు కారం’ చిత్రంను తాను పెద్దగా ఎంజాయ్‌ చేయలేకపోయా అని నటుడు జగపతి బాబు తెలిపారు. సినిమాలోని కొన్ని పాత్రల్లో మార్పులు చేస్తే బాగుండేదని, క్యారెక్టరైజేషన్‌ ఎక్కువగా ఉండటంతో గందరగోళం ఏర్పడిందన్నారు. తన పాత్ర కోసం చేయాల్సిందంతా చేశానని జగపతి బాబు చెప్పారు. త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేశ్‌ బాబు కాంబోలో తెరకెక్కిన చిత్రం గుంటూరు కారం. గత జనవరిలో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. గుంటూరు కారంలో నటించిన జగపతి బాబు తాజాగా సినిమాపై స్పందించారు.

ఓ జాతీయ మీడియాతో జగపతి బాబు మాట్లాడుతూ… ‘నేను ఎప్పుడూ మహేష్ బాబుతో కలిసి పనిచేయడానికి ఇష్టపడతాను. కానీ నిజం చెప్పాలంటే గుంటూరు కారంను ఎంజాయ్‌ చేయలేకపోయా. ఎందుకంటే.. కొన్ని పాత్రల్లో మార్పులు చేస్తే బాగుండేది. క్యారెక్టరైజేషన్‌ కూడా ఎక్కువగా ఉండటంతో గందరగోళం ఏర్పడింది. సినిమాను ముగించడం కొంచెం కష్టమైంది. నా పాత్ర కోసం నేను చేయవలసిందల్లా చేశాను. ఇకపై మహేష్ బాబు, నా కాంబినేషన్‌ని వృథా చేయకూడదనుకుంటున్నాను. మా కాంబో ఉత్తమంగా ఉండాలి. ఆయనతో చేసిన మూవీ ఎప్పటికీ గుర్తుండిపోవాలనుకుంటా. మహేశ్‌ చిత్రాల్లో ఏ అవకాశాన్నీ వదులుకోను. శ్రీమంతుడు నాకు అద్భుతమైన అనుభవాన్ని ఇచ్చింది’ అని అన్నారు.

Also Read: CSK vs KKR: ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను: చెన్నై కెప్టెన్

గుంటూరు కారం చిత్రంలో జగపతి బాబు ప్రతినాయకుడిగా నటించారు. డొక్కా మార్క్స్ బాబుగా జగ్గూ భాయ్ నటించారు. ఒకప్పుడు హీరోగా ఎన్నో హిట్స్ అందుకున్న జగపతి బాబు.. విలన్‌గా సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించి దూసుకుపోతున్నారు. లెజెండ్ సినిమాతో విలన్‌గా తనలోని మరో కోణాన్ని పరిచయం చేశారు. ఇటీవల సలార్‌, ‘గుంటూరు కారంతో ప్రేక్షకుల ముందుకువచ్చారు. ప్రస్తుతం పుష్ప 2లో నటిస్తున్నారు.

 

 

Show comments