Site icon NTV Telugu

Jacqueline Fernandez: మనీలాండరింగ్ కేసులో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు ఊరట

Jacqueline Fernandez

Jacqueline Fernandez

Jaqueline Fernandez: మనీలాండరింగ్ కేసులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు వ్యక్తిగత హాజరు నుంచి ఢిల్లీ కోర్టు మినహాయింపును మంజూరు చేసింది. ఈ కేసులో అభియోగాలు మోపడంపై వాదనలు వినాల్సిన అదనపు సెషన్స్ జడ్జి శైలేందర్ మాలిక్ ఫిబ్రవరి 15కి వాయిదా వేశారు. మరోవైపు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోరుతూ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్ దాఖలు చేసిన దరఖాస్తుపై కోర్టు జనవరి 25న వాదనలు విననుంది.

వృత్తిపరమైన పని కోసం నెల చివరి వారంలో దుబాయ్ వెళ్లాలని ఫెర్నాండెజ్ దాఖలు చేసిన దరఖాస్తుపై తన స్పందనను దాఖలు చేయాలని న్యాయమూర్తి గతంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని ఆదేశించారు.తన కుటుంబ సభ్యులను కలిసేందుకు విదేశాలకు వెళ్లేందుకు అనుమతి కోసం చేసిన అభ్యర్థనను ఈడీ వ్యతిరేకించడంతో డిసెంబర్ 22న కోర్టు నుంచి ఉపసంహరించుకున్నారు.ఈ కేసులో జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌కు నవంబర్ 15, 2022న సాధారణ బెయిల్ మంజూరైన సంగతి తెలిసిందే.

Rahul Gandhi: జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కోసం కాంగ్రెస్ మద్దతు ఇస్తుంది..

దీనికి సంబంధించి గతంలోనే దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ ఆమెకు పలుమార్లు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో ఆమెను నిందితురాలిగా పేర్కొన్న ఈడీ.. దాఖలు చేసిన అనుబంధ ఛార్జ్‌షీట్‌లోనూ జాక్వెలిన్‌ పేరును చేర్చింది. దోపిడీ చేసిన డబ్బు నుంచి నటి లబ్ధి పొందినట్లు దర్యాప్తులో గుర్తించామని ఈడీ వర్గాలు వెల్లడించాయి. సుకేశ్ చంద్రశేఖర్‌ దోపిడీదారు అని జాక్వెలిన్‌కు ముందే తెలుసని, అయినా అతడితో సాన్నిహిత్యం కొనసాగించారని సదరు వర్గాలు పేర్కొన్నాయి. అంతేగాక, సుకేశ్‌ అరెస్టయిన తర్వాత జాక్వెలిన్‌ సాక్ష్యాలను చెరిపేసేందుకు ప్రయత్నించినట్లు తెలిపాయి.

Exit mobile version