Dileep Sankar : నటుడు దిలీప్ శంకర్ హోటల్ గదిలో శవమై కనిపించిన ఘటనలో ఆత్మహత్యకు దారితీసిన ఆధారాలు లభించలేదని పోలీసుల ప్రాథమిక నివేదికలో తేలింది. గదిలో దిలీప్ తలకు కొట్టుకున్నట్లు కూడా అనుమానిస్తున్నారు. మరణానికి కారణం అంతర్గత రక్తస్రావం అని పోలీసుల ప్రాథమికంగా నిర్ధారించారు. అంతర్గత అవయవాలను శాస్త్రీయ పరీక్షల నిమిత్తం పంపించారు. గదిలో అసహజ మరణానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల కారణాలపై స్పష్టత వస్తుందని కంటోన్మెంట్ పోలీసులు గతంలో తెలిపారు. అలాగే తనిఖీల్లో గదిలో మద్యం సీసాలు కనిపించాయి.
Read Also:INDvsAUS Test: మెల్‌బోర్న్ టెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం.. 155 పరుగులకు భారత్ ఆలౌట్
నిన్న తిరువనంతపురంలోని వాన్‌రోస్ జంక్షన్‌లోని ఒక ప్రైవేట్ హోటల్‌లో దిలీప్ శంకర్ (50) శవమై కనిపించాడు. చనిపోయి మూడు రోజుల అయి ఉన్నట్లు సమాచారం. దిలీప్ శంకర్ నాలుగు రోజుల క్రితం హోటల్ గదిని బుక్ చేసుకున్నాడు. రెండు రోజులుగా గది నుంచి బయటకు రాలేదని సమాచారం. సీరియల్ యాక్టింగ్ కోసం హోటల్‌లో రూమ్ తీసుకున్నట్లు సమాచారం. నటీనటులు కూడా దిలీప్‌ను ఫోన్‌లో సంప్రదించినా స్పందించలేదు. తర్వాత వారు కూడా వెతుకుతూ హోటల్‌కు వచ్చారు. దీంతో హోటల్ సిబ్బంది గది తెరిచి చూడగా.. దిలీప్ చనిపోయాడు. చపాతీ, దోస వంటి రెడీ టు ఈట్ వంటకాలను మార్కెట్ చేసేవాడు. అయితే ఈ విషయాలన్నీ అతని భార్య జుమా చూసుకునేది. పిల్లలు బెంగళూరులో చదువు కుంటున్నారు. దిలీప్ శంకర్ హఠాన్మరణం మలయాళ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. నటి సీమా జి నాయర్ సోషల్ మీడియాలో సంతాపం తెలియజేసారు. సోషల్ మీడియాలో అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read Also:Dil Raju : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో నిర్మాత దిల్ రాజు భేటీ..