NTV Telugu Site icon

Actor Arrest : లైంగిక వేధింపుల కేసులో 79 ఏళ్ల నటుడు అరెస్ట్..!

223

223

ఏ సినిమా ఇండస్ట్రీ చూసిన క్యాస్టింగ్ కౌచ్ సమస్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో నుంచి అనేకమంది ఈ సమస్యపై ముందుకు వచ్చి మాట్లాడారు. దేశంలో ఉన్న అన్ని చిత్ర పరిశ్రమల్లోనూ ఈ సమస్య లేకపోలేదు. ప్రతిఒక్క ఇండస్ట్రీలో ఈ సమస్య ఉన్నప్పటికీ సినీ ఇండస్ట్రీ కావడంతో ఏ చిన్న విషయం వచ్చిన అది పబ్లిక్ లో హాట్ టాపిక్ గా మారడం మనం చూస్తూనే ఉంటాం. ఇదివరకు అనేకమంది తాము క్యాస్టింగ్ కోచ్ సమస్యలను ఎదుర్కొన్నమని చాలామంది తెలిపారు. వారు తమ సినీ ప్రయాణంలో ఎదుర్కొన్న అనుభవాలను గురించి తెలుపుతూ.. మిగతావారు అలా గురి కాకుండా ఉండాలంటూ తగు జాగ్రత్తలు సూచించిన వారు కూడా లేకపోలేదు. ఇదిలా ఉండగా తాజా 79 ఏళ్ల నటుడు లైంగిక వేధింపు కేసులు జైలు పాలయ్యాడు.

Also Read: YSRCP MLA Candidates Final List: వైసీపీ ఫైనల్‌ లిస్ట్‌.. ఎమ్మెల్యే అభ్యర్థులు వీరే..

ఏకంగా 91 దేశాల్లో నెంబర్ వన్ గా నిలిచిన స్క్విడ్‌ గేమ్‌ వెబ్ సిరీస్‌ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిజానికి రెండేళ్ల క్రితం వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఒక ఊపుఊపేసింది. ఇప్పటికీ నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ రికార్డ్ కంటిన్యూ చేస్తూనే ఉంది. అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది వీక్షించిన వెబ్ సిరీస్ గా స్క్విడ్‌ గేమ్‌ వెబ్ సిరీస్‌ రికార్డ్ క్రియేట్ చేసింది. ఐతే ఇప్పుడు ఈ సినిమాలో నటించిన 79 ఏళ్ల నటుడికి జైలు శిక్ష విధించింది అది కూడా లైంగిక వేధింపుల కేసులో. ఈ వెబ్ సిరీస్‌లో కీలకపాత్రలో నటించిన ఓ యోంగ్ సు ను అరెస్ట్ చేసారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..

Also Read: Revanth Reddy: కవిత అరెస్ట్ పై కేసీఆర్ ఎందుకు స్పందించలేదు..?

ఓ యోంగ్ సు పై 2017లోనే ఈ అభియోగాలు వచ్చాయి. కాకపోతే ఇప్పటి ఈ కేసు సంబంధించి తీర్పు ఇచ్చింది దక్షిణ కొరియా కోర్టు. ఈయన గ్రామీణ ప్రాంతంలో థియేటర్ ప్రదర్శన కోసం వెళ్లిన సమయంలో 2017లో ఓ మహిళ ను లైంగికంగా వేధించాడు. అయితే ఇక్కడ అరెస్ట్ అయినా నటుడు మాత్రం కేవలం సరస్సును దాటేందుకు ఆమె చేయి పట్టుకున్నా అని తెలిపాడు. ఇది ఇలా ఉండగా కోర్ట్ కు మహిళను వేధించినట్టు సాక్షాధారాలు లభించడంతో కోర్టు జైలు శిక్షను ఖరారు చేసింది.