Site icon NTV Telugu

Priyanka Chopra: ప్రియాంక చోప్రా నాకు ముద్దు పెట్టలేదు: నటుడు

Priyanka Chopra Kiss

Priyanka Chopra Kiss

‘7 ఖూన్ మాఫ్’ చిత్రం షూటింగ్ రోజులను బాలీవుడ్ నటుడు అన్నూ కపూర్‌ గుర్తు చేసుకున్నారు. ఆ చిత్రంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా తనకు ముద్దు పెట్టలేదని తెలిపారు. బోల్డ్‌ సన్నివేశంలో ముద్దు పెట్టేందుకు ప్రియాంక సంకోచించిందని, తాను ప్రధాన హీరో కాకపోవడం వల్లనే ఆమె అయిష్టత చూపిందని పేర్కొన్నారు. హీరోయిన్స్ యువ నటులను ముద్దుపెట్టుకోవడానికి ఇష్టపడతారని, ఇతరులను కిస్ చేయడానికి మాత్రం ఆలోచిస్తారని అన్నూ కపూర్ చెప్పుకొచ్చారు.

అన్నూ కపూర్‌ తాజాగా ఏఎన్‌ఐ పోడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ… ‘7 ఖూన్ మాఫ్ చిత్రంలో ప్రియాంక చోప్రా, నాకు మధ్య కొన్ని బోల్డ్‌ సన్నివేశాలుంటాయి. నాతో ముద్దు సన్నివేశం విషయంలో ప్రియాంక ఆలోచనలో పడ్డారు. డైరెక్టర్ విశాల్ భరద్వాజ్‌ నా దగ్గరకు వచ్చి బోల్డ్‌ కిస్సింగ్ సీన్‌లో నటించడం ప్రియాంక అసౌకర్యంగా ఫీలవుతుందని చెప్పారు. ఆమె అసౌకర్యంగా ఫీల్ అయితే.. సన్నివేశాన్ని మార్చండని చెప్పా. నేను సీన్‌ను ఎందుకు తొలగించాలి?, ఇది ముఖ్యమని భరద్వాజ్‌ నాతో అన్నాడు. చివరకు కంబైన్డ్ షాట్‌లతో ముగించాము’ అని చెప్పారు.

Also Read: KA Trailer: ‘క’ ట్రైలర్‌ విడుదల.. అంచనాలు పెంచేలా, ఆసక్తిరంగా..!

‘నేను ప్రధాన హీరోగా ఉంటే ప్రియాంక చోప్రాకు ఎలాంటి అభ్యంతరం ఉండకపోవచ్చు. నాకు మంచి పెర్సనాలిటీ, లుక్ లేదు. అందుకే ప్రియాంక నాతో ముద్దు సన్నివేశంలో నటించలేదు. హీరోయిన్స్ యువ నటులను ముద్దుపెట్టుకోవడానికి ఇష్టపడతారు కానీ.. ఇతరులను కిస్ చేయడానికి మాత్రం ఆలోచిస్తారు’ అని అన్నూ కపూర్‌ పేర్కొన్నారు. 2011లో ప్రియాంక లీడ్ రోల్‌లో నటించిన చిత్రం 7 ఖూన్ మాఫ్. ఏడుగురు భర్తలున్న మహిళగా.. ఒకరి తర్వాత మరొకరిని చంపే పాత్రలో ఆమె నటించారు. ఈ చిత్రంలో ప్రియాంక ఐదో భర్తగా అన్నూ నటించగా.. ఇద్దరి మధ్య కొన్ని బోల్డ్‌ సన్నివేశాలుంటాయి.

Exit mobile version