Site icon NTV Telugu

Actor Ali: ప్రతి నిరుపేదకు ఇల్లు ఉండాలనే సీఎం జగన్ ఆలోచన గొప్పది..

Actor Ali

Actor Ali

Actor Ali: వైసీపీ చేసిన మేలును వివరించేందుకు మంగళవారం కోవూరు నియోజకవర్గంలోని నార్తురాజుపాళెంలో సామాజిక సాధికార బస్సు యాత్రను నిర్వహించారు. సామాజిక సాధికార యాత్ర మధ్యాహ్నం టపాతోపు వద్ద నుంచి ప్రారంభం కాగా.. రాజుపాలెం సెంటర్‌కు చేరుకుంది. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో రీజినల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి, ఉపముఖ్యమంత్రి పీ రాజన్నదొర, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, నెల్లూరు నగర ఎమ్మెల్యే పీ అనిల్‌కుమార్‌యాదవ్‌, ప్రముఖ సినీనటుడు అలీ, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సభలో ప్రముఖ సినీ నటుడు అలీ ప్రసంగించారు.

ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా నెల్లూరు చేపల పులుసు అంటే ఎంత ఫేమసో.. కోవూరులో ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌ అన్న అంత ఫేమస్ అంటూ అలీ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమ కోసం జగన్ ఎంతో చేస్తున్నారని ఆయన చెప్పారు. ఒకసారి వైయస్ దగ్గరికి తాను, బ్రహ్మానందం వెళ్లామని.. హైదరాబాద్‌లో మాకున్న భూమిలో లారీలు, బస్సులు వెళుతున్నాయి సార్ అని చెప్పామని.. వాళ్లు కళాకారులు వారిని బాధ పెట్టొద్దు అని ఒక అధికారికి చెప్పి న్యాయం చేశారని ఓ ఇన్సిడెంట్‌ గురించి చెప్పారు. పేదవాడి ఆరోగ్యం కోసం వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకువస్తే దాని పరిమితిని రూ.25 లక్షలకు జగన్ పెంచారన్నారు. సమావేశానికి వస్తున్నపుడు జగనన్న ఇళ్లను చూశానని.. ఎంతో సంతోషం కలిగిందన్నారు.

అలీ మాట్లాడుతూ.. “నేను పేదరికం అనుభవించాను. ఎన్నో బాధలు చూసాను. పేదలందరికీ ఇల్లు కట్టించడం ఎంతో ఆనందం. నెల్లూరులో ఒక సినిమా హిట్ అయితే దేశంలో అది హిట్ అయినట్టే లెక్క. వచ్చే ఎన్నికల్లో ప్రసన్న కుమార్ రెడ్డికి 90 వేల ఓట్ల మెజార్టీ ఇవ్వాలి. మీరు మెజార్టీ ఇస్తే ఆయన మంత్రి అవుతారు. ఆయనను మంత్రిగా చూడాలి. వచ్చే ఎన్నికల్లో మంచి మెజార్టీ ఇవ్వండి” అంటూ ప్రజలకు అలీ సూచించారు.

Exit mobile version