ఒలింపిక్ క్రీడల సమయంలో క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందుకు భారత రెజ్లర్ అంతిమ్ పంఘల్‌పై ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ (IOA) చర్యలు తీసుకుంది. మూడేళ్లపాటు నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. మహిళల 53 కిలోల రెజ్లింగ్ పోటీలో పాల్గొన్న అంతిమ్ పంఘల్ ఓడిపోయింది. ఇంతకుముందు వినేష్ ఫొగట్ పాల్గొనే వెయిట్ కేటగిరీ ఇదే. ఆ తర్వాత కూడా వివాదాల్లో ఇరుక్కోవడం ఆశ్చర్యకరమైన విషయం.
Read Also: Sobhita Dhulipala : సమంత నాగచైతన్య విడాకుల తర్వాత.. శోభిత ఏమన్నదంటే?
అంతిమ్ అక్రిడిటేషన్ తో ఆమె సోదరి నిశా ఒలింపిక్ విలేజీలోకి ప్రవేశించడంతో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో.. ఫ్రెంచ్ అధికారులు క్రమశిక్షణా ఉల్లంఘనకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో భారత ఒలింపిక్ సంఘం దృష్టి సారించింది. ఎట్టకేలకు భారత రెజ్లర్ అంతిమ్ పంఘల్, తన సోదరి.. సహాయక సిబ్బందిని తిరిగి భారతదేశానికి పంపాలని నిర్ణయించారు.
Read Also: Bomb Making: యూట్యూబ్ చూసి బాంబులు తయారు చేసిన పిల్లలు..చివరకి.?
