Site icon NTV Telugu

Arjun : ఇండస్ట్రీపై కోపంతో ఆ నిర్ణయం తీసుకున్నాను..

Arjun, Gentilmen

Arjun, Gentilmen

దర్శక దిగ్గజం శంకర్ అంటే ప్రస్తుతం ఇండియన్ సినిమాలో ఒక బ్రాండ్. అయితే ఆయనను స్టార్ డైరెక్టర్‌గా మార్చిన సినిమా, అర్జున్‌ను ‘యాక్షన్ కింగ్’గా నిలబెట్టిన సినిమా మాత్రం ‘జెంటిల్‌మేన్’. ఈ సినిమా విడుదలై దశాబ్దాలు గడుస్తున్నా, నేటికీ ఆ మేజిక్ తగ్గలేదు. అయితే, ఈ సినిమా వెనుక ఒక స్టోరీ ఉందని అర్జున్ సర్జా తాజాగా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

Also Read : Santosh Sobhan : మరో లవ్ స్టోరీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ‘కపుల్ ఫ్రెండ్లీ’ జోడీ..

అర్జున్ మాట్లాడుతూ.. ‘ఆ సమయంలో ఇండస్ట్రీపై నాకు కొంచెం కోపం, నిరాశ ఉండేవి. ఎందుకంటే వరుసగా చేస్తున్న సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వకపోవడంతో, సినిమాలే మానేద్దామని అనుకున్నాను. అందుకే ‘జెంటిల్‌మేన్’ కథ వచ్చినప్పుడు మొదట చేయకూడదని గట్టిగా నిర్ణయించుకున్నాను, కానీ, దర్శకుడు శంకర్ పట్టువదలకుండా కథ వినిపించారు. శంకర్ ఆ కథ చెబుతుంటే నాలో ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఆ కాన్సెప్ట్, అందులోని సోషల్ మెసేజ్ నాకు బాగా నచ్చాయి. ఒకవేళ అంత గొప్ప కథకు ‘నో’ చెబితే నాకంటే తెలివితక్కువ వాడు ఉండడనిపించింది. అంతేకాదు, ఇంత మంచి కథను కాదంటే ఎవరైనా నన్ను కొడతారేమో అన్నంతగా ఆ కథ నన్ను ప్రభావితం చేసింది. అందుకే మళ్లీ మనసు మార్చుకుని ఆ సినిమాకు సంతకం చేశాను’ అని అర్జున్ వివరించారు. అలా ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోదామనుకున్న అర్జున్‌ను ‘జెంటిల్‌మేన్’ మళ్ళీ టాప్ హీరోగా నిలబెట్టింది. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, శంకర్ టేకింగ్, అర్జున్ నటన కలిసి ఈ సినిమాను ఒక కల్ట్ క్లాసిక్‌గా మార్చేశాయి.

Exit mobile version