Mumbai Heroine Case: ముంబై సినీ నటి కాదంబరీ జిత్వానీ వ్యవహారంపై విచారణ అధికారిని బెజవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నియమించారు. విజయవాడ క్రైమ్ ఏసీపీ స్రవంతిని విచారణ అధికారిగా నియమించారు. ఐపీఎస్ అధికారుల పాత్ర ఉందని వస్తున్న వార్తలపై సమగ్ర విచారణ చేసి నివేదిక ఇవ్వాలనీ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ముంబై నటి కాదంబరీ జిత్వానీ వ్యవహారంపై ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. జిత్వానీ నుంచి ఆన్‌లైన్‌లో ఫిర్యాదు తీసుకోవాలని.. ప్రతీ అంశాన్ని క్షుణ్ణంగా దర్యాప్తు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదేశించింది. కాగా, తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు జిత్వానీ.
Read Also: Kadambari Jethwani Issue: బాలీవుడ్ నటి ఇష్యూపై సర్కార్ సీరియస్.. ఉన్నతస్థాయి దర్యాప్తునకు ఆదేశాలు
కాగా, బాలీవుడ్ నటి కాదంబరీ జిత్వానీ ఇష్యూ.. ఏపీలో రాజకీయ దుమారం రేపుతోన్న విషయం విదితమే.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసుపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది.. ఈ కేసులో ఐపీఎస్‌ల ప్రమేయం ఉందనే ఆరోపణలు ఉన్న నేపథ్యంలో.. సర్కార్ నిర్ణయం అ అధికారుల్లో గుబులు పుట్టిస్తోంది.. తాము పోలీసు అధికారులమనే విషయాన్నే మరిచి.. అప్పట్లో అధికారంలో ఉన్న పార్టీకి చెందిన నేతల సూచనల మేరకు బాధితులపైనే కేసులు నమోదు చేయడం.. రకరకాలుగా వేధింపులకు గురిచేశారన్న ఆరోపణలపై త్వరితగతిన విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది ఏపీ సర్కార్.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో.. కొందరు అధికారుల గుండెల్లో రైళ్లు పరుగులుపెడుతున్నాయట.. ఎక్కడ తమ పేరు బయటకు వస్తుందో అనే ఆందోళనలో ఉన్నారట.