Acid Attack: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం లక్కవరంలో ఓ వ్యక్తిపై యాసిడ్ దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ముందుగా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు కుటుంబ సభ్యులు, స్థానికులు.. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. లక్కవరం గ్రామానికి చెందిన ప్రగడ నాగేశ్వరరావు (60) అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి సమయంలో యాసిడ్ దాడి చేశారు.. ఈ యాసిడ్ దాడిలో నాగేశ్వరరావు శరీర భాగాలు తీవ్రంగా గాయపడ్డాయి. బాధితుడుని వెంటనే జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్సలు అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాసిడ్ దాడి ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.. నాగేశ్వరరావుపై యాసిడ్ దాడికి అసలు కారణం ఏంటి అనే కోణంలో విచారణ చేపట్టారు.. అయితే, నాగేశ్వరావుకు బంధువుల మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నట్లు ఆ క్రమంలోనే ఎవరైనా బంధువులే ఈ యాసిడ్ దాడికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also: Viral: ఇలా తయారయ్యారు ఏంట్రా.. వీడెవడో కానీ.. హార్డ్వేర్, సాఫ్ట్వేర్ కు మధ్య తేడా ఇదంట..!