Site icon NTV Telugu

CM Revanth Reddy : రైతులకు అదనపు ఆదాయం.. ఉచితంగా సోలార్ పంప్ సెట్లు

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణలో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన “ఇందిర సౌర గిరి జల వికాసం” పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం మాచారంలో జరిగిన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పలువురు మంత్రులతో కలిసి ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ, అచ్చంపేట నియోజకవర్గాన్ని దేశానికి ఆదర్శంగా నిలిచే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దతామని తెలిపారు. ప్రస్తుతం వ్యవసాయంలో ఉపయోగిస్తున్న కరెంట్ పంప్ సెట్ల స్థానంలో 100 రోజుల వ్యవధిలో సోలార్ పంప్ సెట్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. రైతులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా, ప్రభుత్వం నూటికి నూరు శాతం ఖర్చును భరిస్తుందని హామీ ఇచ్చారు. రైతులకు 5 హెచ్‌పీ , 7.5 హెచ్‌పీ సామర్థ్యం గల సోలార్ పంప్ సెట్లు ఉచితంగా అందించనున్నట్టు సీఎం చెప్పారు. వ్యవసాయ అవసరాలకు వినియోగించిన తరువాత మిగిలిన విద్యుత్‌ను ప్రభుత్వం సేకరించి, దాని విలువను మహిళా రైతుల ఖాతాల్లో ప్రతి నెల జమ చేస్తుందని వివరించారు. ఈ విధంగా ప్రతి రైతు నెలకు రూ. 3 వేల నుంచి 5 వేల వరకు అదనంగా సంపాదించగలడని తెలిపారు.

Gulzar House : ఒకేసారి మూడు తరాలు అగ్నికి ఆహుతి.. హృదయవిదారకం..!

సోలార్ పంప్ సెట్లు అందుకున్న లబ్ధిదారులు వాటిని జాగ్రత్తగా సంరక్షించాలని సూచించిన సీఎం, ఇతర రైతులకు అవగాహన కల్పించే విధంగా శిక్షణ కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నల్లమల్ల అడవుల్లో విద్యుత్ లైన్ల ఏర్పాటులో ఉన్న సవాళ్లను పరిష్కరించే మార్గంగా ఈ సోలార్ విద్యుత్ వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అలివేలు అనే మహిళా రైతు మాట్లాడుతూ.. మేము 29 మంది కలిసి ఈ సోలార్ పంప్ సెట్ ఏర్పాటుచేశాం. ఇప్పుడు పండ్ల తోటలు సాగుచేస్తున్నాం. మాకు ఇచ్చిన అవకాశానికి మా ఆనందం చెప్పలేనిది. మిమ్మల్ని చూస్తుంటే దేవుడిని చూసినట్లుంది అని అన్నారు. చెంచు గిరిజనుల అభివృద్ధిపై దృష్టిసారించిన సీఎం రేవంత్ రెడ్డి, నియోజకవర్గంలో ఉన్న చెంచులకు పదిరోజుల్లో ఇందిరమ్మ ఇల్లు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Gulzar House: గుల్జార్‌హౌస్‌ అగ్నిప్రమాదం వెనుక అక్రమ కరెంట్‌ కనెక్షన్..!

Exit mobile version