NTV Telugu Site icon

Vamshi Krishna: వైఎస్ లానే రేవంత్ పాలన ఉంటుంది.. నేను కూడా మంత్రి పదవి ఆశిస్తున్నా..

Vamshi Krishna

Vamshi Krishna

Vamshi Krishna: దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలన లాగే.. రేవంత్ రెడ్డి పాలన ఉంటుంది అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ.. హైదరాబాద్‌ ఎల్బీ స్టేడియం వేదికగా తెలంగాణ ముఖ్యమంత్రిగా రేపు రేవంత్‌ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న విషయం విదితమే కాగా.. ఇప్పటికే అధికార యంత్రాంగంతో పాటు.. పార్టీ నేతలు కూడా ఏర్పాట్లలో మునిగిపోయారు. ఎల్బీ స్టేడియంలో జరుగుతోన్న ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తు్న్నారు.. అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణతో పాటు.. మరికొందరు నేతలు ఎల్బీ స్టేడియానికి వచ్చారు.. ఈ సందర్భంగా ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన వంశీ కృష్ణ. నేను కూడా మంత్రి పదవి ఆశిస్తున్నానని తెలిపారు.. జిల్లాలో నేనే సీనియర్‌ను అని.. అంతే కాదు పార్టీకి విధేయుడిగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇక, వైఎస్ రాజశేఖరరెడ్డి లానే రేవంత్ రెడ్డి పాలన ఉంటుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. రేపటి ప్రమాణస్వీకారోత్సవానికి లక్ష మంది వస్తారని అంచనా వేశారు. మేం పని చేయకపోతే ప్రజలు మమ్మల్ని కూడా ప్రశ్నించవచ్చు అన్నారు అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ.

Read Also: KTR: ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి.. కేటీఆర్ రియాక్షన్ ఏమిటంటే..!

కాగా, రేపు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్నారు.. ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే రేపటి కార్యక్రమం కోసం ఉత్సుకతతో కాంగ్రెస్ నేతలు, పార్టీ శ్రేణులు ఎదురుచూస్తున్నాయి.. ఇప్పటికే హైదరాబాద్ కు భారీగా చేరుకుంటున్నారు హస్తం పార్టీ కార్యకర్తలు, అభిమానులు.. మరోవైపు.. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేశారురేవంత్‌రెడ్డి.. ప్రజా ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం పలికారు.. తెలంగాణ ప్రజలకు అభినందనలు.. విద్యార్థుల పోరాటం, అమరుల త్యాగం, సోనియాగాంధీ ఉక్కు సంకల్పంతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో మనందరి ఆకాంక్షలు నెరవేర్చే ఇందిరమ్మ రాజ్య స్థాపనకు సమయం ఆసన్నమైంది.. రాష్ట్రంలో ప్రజాస్వామ్య, పారదర్శక పాలన అందించేందుకు, బడుగు, బలహీన వర్గాలు, దళిత, గిరిజన, మైనారిటీ, రైతు, మహిళ, యువత సంక్షేమ ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు మీ అందరి ఆశీస్సులతో 2023 డిసెంబర్‌ 7వ తేదీన మధ్యాహ్నం 1.04 గంటలకు హైదరాబాద్ ఎల్బీ సేడియంలో ప్రజా ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయబోతోంది.. మీ అందరికీ ఇదే ఆహ్వానం అంటూ ఆ లేఖలో రేవంత్‌ రెడ్డి పేర్కొన్న విషయం విదితమే.