NTV Telugu Site icon

Hyderabad Crime: బైక్ నంబర్‌ ప్లేట్‌కు ఫేస్ మాస్క్.. కానీ మూల్యం చెల్లించక తప్పలేదు..

Arrest

Arrest

Hyderabad Crime: కరోనా నుంచి తప్పించుకోవడానికి ముక్కూ, మూతి కవర్ చేసేలా మాస్కులను వాడటం సాధారణం అయిపోయింది. ప్రతి ఒక్కరు వీటిని విధిగా ధరించాలని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇలా ఎంత మంది ఆచరిస్తున్నారో లేదో కానీ, ఓ వ్యక్తి మాత్రం తన బైక్ నంబర్ ప్లేటుకు కూడా మాస్క్ తగిలించాడు. అది ఏదో జాగ్రత్త కోసం అనుకుంటే పొరపడినట్టే. ట్రాఫిక్ చలానాల నుంచి తప్పించుకునేందుకు ఈ విధంగా చేశాడు. ట్రాఫిక్ చలానా పడకుండా తన యాక్టీవా బండి నంబర్ పూర్తిగా కనిపించకుండా దానికి తగిలించాడు. ఇలాంటి చావు చావు తెలివి తేటలకు పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

ఇటీవల రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లోని క్యూబా కాలనీకి చెందిన సయ్యద్ షోయబ్ అక్తర్ అలీ చలానాలు పడకుండా తన బండి నంబర్‌ ప్లేట్‌కు ఫేస్‌ మాస్క్ తగిలించాడు. రోడ్డుపై వెళ్తున్న అతడిని గమనించిన పోలీసులు వెంబడించి పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసి నాంపల్లిలోని ప్రత్యేక మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచారు. న్యాయస్థానం అతడికి 8 రోజుల సాధారణ జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలని పోలీసులు వెల్లడించారు. వాహనదారుల విషయంలో తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా నంబర్ ప్లేట్ ట్యాంపరింగ్ పై ట్రాఫిక్ పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు.

Erragadda Metro station: ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ పై నుండి దూకి మహిళ ఆత్మహత్య

ట్రాఫిక్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని పోలీసులు వాహనదారులకు పదేపదే చెబుతున్నా పెడిచెవిన పెడుతుండటంతో ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించే వారిపై పోలీసులు మరికొన్ని చర్యలకు ఉపేక్షించారు. వాహనాల నెంబర్‌ ప్లేట్లకు ఇతర స్టిక్కర్స్‌ అతికించడం, నెంబర్‌ ప్లేట్‌ కనిపించకుండా మాస్క్‌ వేయడం, పెండింగ్‌ చలానాలను ఎగ్గొట్టడం, కార్ల అద్దాలకు బ్లాక్‌ ఫిల్మ్‌లు వేయడం నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనదారులపై కొరఢా ఝులిపిస్తున్నారు. అంతేకాకుండా వాహనానికి నంబర్ ప్లేట్ కనిపించకుండా చేస్తే జైలుకు పంపుతామని స్పష్టం చేశారు. అలాంటి వారిపై ఛార్జీషీట్ వేసి వాహనాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు.