Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Accused Arrested In Mro Ramanaiah Murder Case

MRO Ramanaiah Murder Case: ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌.. సీపీ కీలక వ్యాఖ్యలు

Published Date :February 5, 2024 , 7:46 pm
By Sudhakar Ravula
MRO Ramanaiah Murder Case: ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌.. సీపీ కీలక వ్యాఖ్యలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

MRO Ramanaiah Murder Case: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడిగా ఉన్న మురారి సుబ్రమణ్యం గంగారాంని అరెస్ట్ చేశారు పోలీసులు.. హత్య జరిగిన తర్వాత రోజు తెల్లవారుజామున వరుకు నిందితుడు విశాఖలోనే ఉన్నట్టు పోలీసులు గుప్పించారు.. ఆ తర్వాత విశాఖ నుంచి విమానంలో బెంగళూరు పరారయ్యాడు.. అయితే, ఈ రోజు ఎగ్మురు రైల్వే స్టేషన్ లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. హత్య కేసులో నిందితుడు పై సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఓ కేసు నమోదు అయినట్టు విశాఖ పోలీసులు గుర్తించారు. రెండేళ్ల క్రితం హైదరాబాద్ నుంచి విశాఖకి వెళ్లాడు నిందితుడు. విశాఖలోని పనోరమా హిల్స్ లో నివాసం ఉంటూ.. రియల్‌ఎస్టేట్‌ లావాదేవీలు చేస్తునట్టు గుర్తించారు. ఓ అపార్ట్ మెంట్ నిర్మాణం విషయంలో 22/A లోకి వెళ్లి విషయంలో రమణయ్యకి నిందితుడుకి పరిచయం ఏర్పడింది.. కొందరి యాజమానుల వద్ద నుంచి 57 లక్షల రూపాయల వరకు నిందితుడు వసూలు చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.. ఆ 57 లక్షలు తీసుకొని కూడా పని చేయకపోవడంతో రమణయ్య ని హత్య చేసినట్టు అనుమానిస్తున్నారు.

Read Also: Minister Jogi Ramesh: వసంత కృష్ణప్రసాద్‌పై జోగి రమేష్‌ కౌంటర్ ఎటాక్.. జగన్ మాటే నాకు ఫైనల్..!

మీడియాతో మాట్లాడిన విశాఖ సీపీ రవి శంకర్.. ఎమ్మార్వో హత్య కేసులో నిందితుడిని చెన్నైలో అరెస్ట్‌ చేసినట్టు వెల్లడించారు. చెన్నై శివారులో స్పెషల్ టీమ్ టెక్నికల్ అవిడెన్స్ తో పట్టుకుందన్నారు. మొత్తం 10 టీమ్స్ నిందితుడు కోసం గాలించాయి.. నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగారం.. పేరు పెద్దగా ఉండడం వల్ల మిస్ కమ్యూనికేషన్ తో పట్టుకోవడంలో ఆలస్యం అయ్యిందన్నారు. విశాఖ నుండి చెన్నైకు వయా బెంగుళూరు టికెట్ బుక్ చేసుకున్నాడు.. బెంగళూరులో ఇతని పూర్తి పేరు అనౌన్స్ చేయడంతో అలెర్ట్ అయి.. ఎయిర్‌పోర్ట్‌ నుంచి బస్సులో చెన్నై బయలుదేరాడు.. చెన్నై చెంగల్ పేట్ దగ్గర మా టీం అతడిని పట్టుకుందని వెల్లడించారు. ప్రస్తుతం నిందితుడుని క్షుణ్ణంగా పరిశీలించి, విచారణ జరుపుతాం.. లాండ్, ఆర్ధిక లావా దేవీలు కారణంగా ఈ హత్య చేసినట్టు తెలుస్తుందన్నారు. కేసు రీ ఇన్వెస్ట్‌గేషన్‌ చేసి హత్యకు ప్రధాన కారణాలు, వాస్తవాలు వెల్లడిస్తాం అన్నారు. నిందితుడు ఓ ప్రయివేట్ రియల్ ఎస్టేట్ కంపెనీకి మేనేజర్ గా పని చేస్తున్నాడు.. విజయవాడ, సైబరాబాద్ లో ఇతనిపై చీటింగ్ కేసులు ఉన్నాయి.. ఎమ్మార్వో హత్య కేసుకు సంబంధించి కీలకమైన 3 ఫైల్స్ స్వాధీనం చేసుకున్నాం… హత్య జరిగిన మరుసటి రోజు మధ్యాహ్నం 3 గంటలవరకు విశాఖ ఎయిర్పోర్ట్ లోనే నిందితుడు ఉన్నాడని వెల్లడించారు విశాఖ సీపీ రవి శంకర్.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • accused
  • Andhra Pradesh
  • MRO Ramanaiah
  • MRO Ramanaiah murder case
  • police

తాజావార్తలు

  • GT vs RR: ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం..

  • Off The Record : ప్రేమ్ సాగర్ రావులో నిరాశ, నిస్పృహలు పెరిగిపోతున్నాయా?

  • Off The Record: ఇంచార్జ్ కోసం పి.గన్నవరం టీడీపీ కేడర్ ఎదురు చూపులు

  • Instagram Love Tragedy: యువతి ప్రాణం తీసిన ఇన్‌స్టా లవ్‌.. ఎలుకల మందు తాగి..!

  • Off The Record: జనసేన కోసం రంగంలోకి ఐప్యాక్ మాజీ టీం..

ట్రెండింగ్‌

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions