Site icon NTV Telugu

Leh Accident: లోయలో పడ్డ స్కూల్ బస్సు.. ఆరుగురు దుర్మరణం, మరో 22 మంది

Leh Accident

Leh Accident

జమ్మూ కాశ్మీర్ లేహ్‌లోని దుర్గుక్ ప్రాంతంలో గురువారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు స్కూల్ బస్సు 200 మీటర్ల లోతైన లోయలో పడింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. మరో 22 మంది గాయపడినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీం ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిని ఆర్మీ, CHC టాంగ్ట్సే ఆరోగ్య సంరక్షణ కేంద్రాలలో చేర్చినట్లు లేహ్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు.

Read Also: Kolkata doctor case: వీడు మనిషి కాదు జంతువు..! సీబీఐ సైకో ఎనాలసిస్ టెస్ట్లో సంచలన విషయాలు

పెళ్లికి హాజరయ్యేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ బస్సులో ఇద్దరు పిల్లలు, 23 మంది స్కూల్ ఉద్యోగులు సహా దాదాపు 25 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఒక ఉద్యోగి వివాహానికి హాజరయ్యేందుకు దుర్బుక్‌కు వెళ్తుండగా దుర్బుక్ మోడ్ సమీపంలో లోతైన లోయలో పడిపోయింది.

Read Also: YS Jagan: అందుకే వక్ఫ్‌ బిల్లును వ్యతిరేకిస్తున్నాం.. క్లారిటీ ఇచ్చిన వైఎస్‌ జగన్‌

కాగా.. గాయపడిన వారిని లేహ్ జిల్లా ఆసుపత్రికి తరలించడానికి ప్రభుత్వం మూడు హెలికాప్టర్లను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో.. ఇండియన్ ఆర్మీ, లడఖ్ పోలీస్, రెవెన్యూ డిపార్ట్‌మెంట్ అధికారులు మరియు స్థానిక నివాసితులు క్షతగాత్రులను ఆరోగ్య కేంద్రాలకు తరలించడంలో సహాయపడ్డారు. ప్రస్తుతం క్షతగాత్రులు లేహ్ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Exit mobile version