NTV Telugu Site icon

AP Liquor Shops Tenders: ఏపీలో ముగిసిన మద్యం దుకాణాల దరఖాస్తుల స్వీకరణ..

Ap Liquer

Ap Liquer

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ మద్యం షాపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న కూటమి ప్రభుత్వం.. కొత్త లిక్కర్ పాలసీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.. ఈ క్రమంలో.. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుల ద్వారా స్వీకరించింది. అయితే.. నేటికి దరఖాస్తుల స్వీకరణ గడువు ముగిసింది. గడువు ముగిసే సమయానికి సుమారు 85 వేలకి పైగా దరఖాస్తులు వచ్చాయి. మద్యం దరఖాస్తుల ద్వారా రూ. 1700 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం రానుంది. 3396 మద్యం షాపులకు వెల్లువలా దరఖాస్తులు అందాయి. మరోవైపు.. జిల్లాల నుంచి ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సమాచారాన్ని క్రోడీకరిస్తున్నారు. పూర్తి లెక్క తేలేసరికి 86-87 వేల మధ్యన దరఖాస్తులు దాఖలయ్యే ఛాన్స్ ఉందని అధికారులు చెబుతున్నారు.

Read Also: Doraemon: చిన్నపిల్లల డోరేమాన్ వాయిస్ ఆర్టిస్ట్ ఇకలేరు.. ఒయామా కన్నుమూత

ఇదిలా ఉంటే.. ఎన్టీఆర్ జిల్లాలో అత్యధికంగా, అల్లూరి జిల్లాలో అత్యల్పంగా దరఖాస్తుల దాఖలు అయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాఖలైన దరఖాస్తుల ప్రకారం ప్రతి షాపునకూ 25-26 అప్లికేషన్లు దాఖలు అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లాలో 113 మద్యం దుకాణాల కోసం 5704 అప్లికేషన్లు దాఖలు అయ్యాయి. ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ప్రతి షాపునకూ 50-51 దరఖాస్తులు దాఖలు చేశారు టెండర్ దారులు. మద్యం దుకాణాల కోసం రిజిస్ట్రేషన్లు ముగిసినా రాత్రి 12 గంటల్లోగా డబ్బులు చెల్లించే అవకాశం కల్పించింది ఎక్సైజ్ శాఖ. మరోవైపు.. విదేశాల నుంచి కూడా ఆన్ లైన్లో మద్యం దుకాణాలకు దరఖాస్తులు దాఖలు చేశారు. తమ అనుచరులు వేసే మద్యం టెండర్లకు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఫీజు చెల్లించారు. మద్యం దుకాణాల కోసం ఎమ్మెల్యేల నుంచి భారీగా ఒత్తిళ్లు ప్రారంభమయ్యాయి. దీంతో.. భారీ ఎత్తున మద్యం సిండికేట్లు ఏర్పడింది.

Read Also: Mahadev Betting App: జ్యూస్ అమ్ముకునే స్థాయి నుంచి రూ.6000 కోట్ల నేరసామ్రాజ్యం..

దరఖాస్తులు పెద్దగా పడకుండా మద్యం సిండికేట్ రింగ్ అయింది. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు రంగంలోకి దిగి వార్నింగు ఇవ్వడంతో మద్యం టెండర్ల ఎపిసోడ్ దారిలోకి వచ్చింది. ఈ స్థాయిలో మద్యం దుకాణాల కోసం దరఖాస్తులు రావడం ఇదే తొలిసారని ఎక్సైజ్ శాఖ పేర్కొంది. ఈ నెల 14వ తేదీన మద్యం దుకాణాల కేటాయింపు కోసం అధికారులు లాటరీ నిర్వహించనున్నారు. అనంతరం.. ఈ నెల 16వ తేదీ నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి రానుంది. అన్ని రకాల బ్రాండ్లకు చెందిన చీప్ లిక్కర్‌ను రూ. 99కే అందివ్వనుంది ఎక్సైజ్ శాఖ.