NTV Telugu Site icon

ACC Deal: మరో సిమెంట్ కంపెనీని కొనేస్తున్న అదానీ గ్రూప్

Gautam Adani

Gautam Adani

ACC Deal: అదానీ గ్రూప్ ఇప్పటికే తన సిమెంట్ కంపెనీలైన ఏసీసీ, అంబుజా సిమెంట్స్ ద్వారా ఈ రంగంలో భారీ మార్కెట్ వాటాను సాధించింది. ఇప్పుడు అదానీ గ్రూప్ మరో సిమెంట్ కంపెనీని కొనుగోలు చేయనుంది. ఏసియన్ కాంక్రీట్స్ అండ్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మిగిలిన 55 శాతం వాటాను కొనుగోలు చేయాలనే నిర్ణయానికి ACC లిమిటెడ్ బోర్డు ఆమోదం తెలిపింది. ఎసిసిపిఎల్‌లో ఎసిసి ఇప్పటికే 45 శాతం వాటాను కలిగి ఉంది.

Read Also:Supreme Court: బిల్కిస్ బానో కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. క్షమాభిక్ష రద్దు

ఈరోజు జనవరి 8న జరిగిన ACC బోర్డు మీటింగ్‌లో మిగిలిన 55 శాతం వాటాను రూ.425.96 కోట్లకు ఏషియన్ కాంక్రీట్స్ అండ్ సిమెంట్స్‌తో ఒప్పందం చేసుకోవాలని నిర్ణయించారు. ACCPL నలగర్ (హిమాచల్ ప్రదేశ్)లో 1.3 MTPA సిమెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. దాని అనుబంధ సంస్థ ఏషియన్ ఫైన్ సిమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ (AFCPL) రాజ్‌పురా (పంజాబ్)లో 1.5 MTPA సిమెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఈ డీల్‌లో ఈ అనుబంధ కంపెనీ కూడా అదానీ గ్రూప్‌ కిందకే వస్తుంది.

Read Also:Ayodhya Rama: అయోధ్య రాములోరి ప్రాణ ప్రతిష్ఠ.. చేనేత కార్మికులకు చేతినిండా పని..!