ACB Raids: విద్యుత్ శాఖ అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) అంబేద్కర్‌పై వచ్చిన అవినీతి ఆరోపణల నేపథ్యంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు విస్తృత సోదాలు నిర్వహించారు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ సోదాల్లో భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి. ఈ ఆరోపణల కింద కేసు నమోదు చేసి, అంబేద్కర్‌తో పాటు ఆయన సన్నిహితులు, బినామీల నివాసాల్లో 15 బృందాలు ఏకకాలంలో సోదాలు చేపట్టాయి.
Ayyanna Patrudu: అసెంబ్లీకి రాకపోతే జీతం ఎందుకు ఇవ్వాలి..? ఎమ్మెల్యేలకు ఏమైనా కొమ్ములు ఉన్నాయా?
ఏసీబీ దాడుల్లో రూ. 2 కోట్ల 18 లక్షల నగదు అంబేద్కర్ బినామీ సతీష్ నివాసంలో లభ్యమైంది. అంబేద్కర్‌కు సహకరిస్తున్న వారిని కూడా గుర్తించి, వారి ఇళ్లపై దాడులు చేశారు. ఈ సోదాల్లో వ్యవసాయ భూములు, అపార్ట్‌మెంట్లు, ఫ్లాట్లు, గచ్చిబౌలిలో ఒక G+5 భవనంను అధికారులు గుర్తించారు. ప్రభుత్వ విలువ ప్రకారం, రూ. 2 కోట్ల 11 లక్షల విలువైన భూమిని కూడా సీజ్ చేశారు. పటాన్ చెరువులో అంబేద్కర్‌కు చెందిన ‘ఆమ్దార్ కెమికల్’ కంపెనీలో నిర్మిస్తున్న నిర్మాణాలను అధికారులు గుర్తించారు. ఈ నిర్మాణానికి అంబేద్కర్ రూ. 1 కోటి ఖర్చు చేసినట్లు తేలింది.
Pakistan: “ఢిల్లీ నుంచి పాకిస్తాన్‌ను రక్షించేందుకే ఉగ్రవాదం”.. జైషే ఉగ్రవాది ఇలియాస్ కాశ్మీరీ..
అంబేద్కర్ కారులో కూడా రూ. 5.50 లక్షల నగదు లభ్యమైంది. దీంతో పాటు ఆయన బ్యాంకు ఖాతాల్లో రూ. 77 లక్షలు ఉన్నట్లు, అలాగే తన బినామీల పేరు మీద రూ. 45 లక్షల విలువ చేసే రెండు కార్లను కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు వెల్లడించారు. అవినీతి ఆరోపణలపై ఏడీఈ అంబేద్కర్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆయనకు సహకరించిన వారిపై కూడా దర్యాప్తు జరిపి తగు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ ఆనంద్ స్పష్టం చేశారు.
