NTV Telugu Site icon

Bribe : లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇద్దరు ఉద్యోగులు

Bribe

Bribe

ACB Raids on Warangal Municipal office

అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం కోసం ప్రజలను పీడిస్తున్న అధికారులు, ఉద్యోగులపై నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో జనం నుంచి లంచం పుచ్చుకుంటున్న వారిని వల పన్ని పట్టుకుంటున్నారు. ఇటీవల లంచం పుచ్చుకుంటుండగా భూపాలపల్లి జిల్లాలో ఒక పోలీస్ ఎస్సైని, వరంగల్ జిల్లాలో ఓ తహసిల్దార్ ను ఏసీబీ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఇవి మర్చిపోకముందే తాజాగా ఇద్దరు మున్సిపల్ శాఖ ఉద్యోగులు ఏసీబీ వలకు చిక్కారు. ఈరోజు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కు చెందిన కాశీబుగ్గ సర్కిల్ ఆఫీస్ లో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు.

Also Read : Gutta Sukender Reddy : రూపాయి విలువ పడిపోయిందే అందుకే..
లంచం తీసుకుంటున్న ఇద్దరు ఉద్యోగులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఓ పని కోసం స్థానికుడి నుంచి సర్కిల్ ఆఫీస్ లో రూ.15 వేలు నగదు లంచం పుచ్చుకుంటుండగా రెవెన్యూ ఇన్ స్పెక్టర్ రబ్బాని, బిల్ కలెక్టర్ రంజిత్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. రబ్బాని, రంజిత్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాశీబుగ్గ సర్కిల్ ఆఫీసులో సోదాలు జరుపుతున్నట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అవినీతి ఆరోపణలకు కేరాఫ్ గా మారిన జీడబ్ల్యూఎంసీ ఆఫీస్ లో ఏసీబీ దాడులు కలకలం సృష్టించాయి.