NTV Telugu Site icon

ACB Raids: ఏసీబీ వలకు చిక్కిన అవినీతి తిమింగలం.. పెద్ద ఎత్తున బయటపడుతున్న అక్రమాస్తులు

Acb

Acb

ACB Raids: అవినీతి నిరోధక శాఖకు ఓ అవినీతి తిమింగలం చిక్కింది. ఇరిగేషన్ ఏఈ నికేష్ ఇంట్లో ఏసీబీ సోదాల్లో పెద్ద ఎత్తున అక్రమాస్తులు బయటపడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా నికేష్‌కు చెందిన 33 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మార్కెట్ విలువ ప్రకారం దాదాపు రూ.300 కోట్లకు పైగా ఆస్తులను గురించినట్లు సమాచారం. మూడు ఫామ్‌హౌస్‌లతో పాటు మూడు విల్లాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఎకరాల కొద్ది ల్యాండ్ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌లోని చెరువులు దాన్ని పరిసర ప్రాంతాల పరిరక్షణ పర్యవేక్షణ అధికారిగా నికేష్ పనిచేశారు.

Read Also: Students Protest: కోఠి మహిళా కళాశాలలో ఆందోళనకు దిగిన విద్యార్థినులు

ప్రస్తుతం నికేష్ సస్పెన్షన్‌లో ఉన్నాడు. 6 నెలల క్రితం లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏఈ నికేష్ పట్టుబడ్డాడు. రెడ్‌హిల్స్‌లోని రంగారెడ్డి జిల్లా ఎస్‌ఈ కార్యాలయంలో 6 నెలల క్రితం ఏసీబీ రైడ్.. ఒక అనుమతి కోసం దరఖాస్తుదారుడి నుంచి అధికారులు రూ.2 లక్షల 50 వేలు డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటుండగా ఏసీబీకి ఈఈ బన్సీలాల్, ఏఈలు కార్తీక్, నికేష్‌లు పట్టుబడ్డారు. అప్పటి నుంచి నికేష్ సస్పెన్షన్‌లో ఉన్నాడు. సస్పెన్షన్‌లో ఉన్న నికేష్ ఆస్తులపై ఏసీబీ అధికారులు కూపీ లాగగా.. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించారు. ఉదయం నుంచి సోదాలు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున డబ్బు, నగలు, బంగారు ఆభరణాలు గుర్తించారు. కోట్ల విలువైన భూములకు చెందిన డాక్యుమెంట్లు.. బినామీ పేర్లతో, కుటుంబ సభ్యులు, బంధువుల పేర్ల మీద కోట్ల రూపాయల విలువైన ఆస్తులను గుర్తించారు.

 

Show comments