NTV Telugu Site icon

ACB decoy operation: తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ డెకాయ్ ఆపరేషన్..

Decoy Operation

Decoy Operation

తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీఏ ఆఫీసుల్లో ఏసీబీ డెకాయ్ ఆపరేషన్ చేపట్టింది. ఏసీబీ అధికారులు మారువేషాల్లో వెళ్లి తనిఖీలు నిర్వహిస్తున్నారు. లారీ డ్రైవర్లుగా వేషం మార్చుకుని చెక్పోస్ట్ల దగ్గర తనిఖీలు చేపట్టారు. ఏక కాలంలో ఉమ్మడి పది జిల్లాల పరిధిలోని చెక్ పోస్టులలో తనిఖీలు చేపట్టారు.

Read Also: Kavitha: కవితకు దొరకని ఊరట.. బెయిల్‌పై తీర్పు రిజర్వ్

మరోవైపు.. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట చెక్ పోస్ట్ దగ్గర ఏసీబీ అధికారుల సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో.. లారీ డ్రైవర్ల వేషంలో వెళ్లిన ఏసీబీ అధికారులను.. ఆర్టీఏ చెక్పోస్ట్ సిబ్బంది లంచం డిమాండ్ చేశారు. ఒక్కో వాహనం నుంచి అనధికారికంగా వందల రూపాయలు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. తెలంగాణ-ఏపీ సరిహద్దు ప్రధాన చెక్ పోస్ట్ కావడంతో.. అశ్వరావుపేట చెక్ పోస్ట్ ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. వచ్చిన ప్రతి వాహనం నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. మరోవైపు.. ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం బోరాజ్ చెక్ పోస్ట్ దగ్గర భారీ మొత్తంలో లెక్కల్లో లేని నగదును ఏసీబీ అధికారులు సీజ్ చేశారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. అయితే.. 12 ఏళ్ల తర్వాత రవాణాశాఖపై ఏసీబీ రైడ్స్ చేపట్టింది.

Read Also: Biryani: మహిళ ప్రాణం తీసిన ‘‘బిర్యానీ’’.. ఏం జరిగిందంటే..?