NTV Telugu Site icon

Chandrababu Case: బెయిల్, కస్టడి పిటిషన్ డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు

Chandrababu Case

Chandrababu Case

టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టులో చుక్కెదురైంది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు తీర్పును వెలువరించింది. బాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టి వేసింది. అదే సమయంలో సీబీఐ దాఖలు చేసిన కస్టడీ పిటిషన్‌ను సైతం కోర్టు కొట్టివేస్తూ తీర్పును ఇచ్చింది. రూ.300 కోట్లకు పైగా స్కిల్‌ స్కామ్‌ వ్యవహారంలో అరెస్టైన చంద్రబాబు ప్రస్తుతం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్ లో ఉన్నారు.

Read Also: Gaza Strip: గాజా దిగ్బంధనం.. నీరు, ఆహారం, ఇంధనం నిలిపివేత

చంద్రబాబు, సీఐడీ అధికారులు దాఖలు చేసిన పిటిషన్లపై ఏసీబీ కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. రెండు పిటిషన్లను కొట్టివేస్తూ నేడు ఏసీబీ కోర్టు తీర్పును వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఫైబర్‌నెట్‌, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌, అంగుళ్లు కేసు వ్యవహారంలో బాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టి వేసింది. అయితే, ఏసీబీ కోర్టు గతవారమే ఈ రెండు పిటిషన్లపై విచారణ పూర్తి చేసి తీర్పును మాత్రం రిజర్వ్ చేసింది. దీనిపై ఇవాళ తీర్పు వెలువరించిన ఏసీబీ కోర్టు.. రెండు పిటిషన్లను డిస్మిస్ చేసింది. అదే సమయంలో సుప్రీంకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై కీలక వాదనలు కొనసాగుతున్నాయి. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాది హరీశ్‌ సాల్వే వాదనలు వినిపించగా.. సీఐడీ తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తున్నారు.

Show comments