Bribe: ఏసీబీ వలకు ఓ అవినీతి చేప చిక్కింది. మహిళా రైతు నుండి రెండు లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు గుంటూరు జిల్లాలోని అంకిరెడ్డిపాలెం వీఆర్వో షేక్ హసీనా బేగం పట్టుబడింది. చెరుకూరి ప్రమీలా రాణి అనే మహిళ రైతు నుండి పాస్ పుస్తకాల పేరు మార్పు కోసం రూ.2 .50 లక్షల డిమాండ్ చేశారు. తన భర్త చనిపోవడంతో 1.25 ఎకరాల భూమిని తన పేరిట మార్చాలని ప్రమీల కోరింది. ప్రమీల వద్ద రెండు లక్షలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో వీఆర్ఓ హసీనా బేగంపై మంగళగిరి ప్రాంతంలో భూ వివాదాలు ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం గుంటూరు మండలం వెంగళాయపాలెం 1,2 సచివాలయాల ఇన్చార్జిగా హసీనా వ్యవహరిస్తున్నారు.
Read Also: UP: ఎవడ్రా నువ్వు.. ముగ్గురు గర్ల్‌ఫ్రెండ్స్.. గిఫ్ట్‌ల కోసం బ్యాంకుకే కన్నం…