NTV Telugu Site icon

IND vs NZ: భారత్‌, న్యూజిలాండ్‌ సెమీస్‌ మ్యాచ్.. మూడు నగరాల్లో భారీ స్క్రీన్లు! తెలుగు ప్రేక్షకులకు పండగే

Ind Vs Nz 1st Semi Final

Ind Vs Nz 1st Semi Final

Big Screens for India vs New Zealand 1st Semi-Final in AP: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్ల మధ్య బుధవారం మొదటి సెమీస్‌ మ్యాచ్‌ జరగనుంది. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ముంబైలోని వాంఖడే మైదానంలో ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. సెమీస్‌ మ్యాచ్‌ వీక్షించడం కోసం క్రికెట్ ఫాన్స్ ఇప్పటినుంచే ప్లాన్స్ వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆంధ్రా క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసీఏ) అభిమానుల కోసం భారీ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తోంది.

Also Read: IND vs AUS Tickets: నవంబర్ 15 నుంచి భారత్‌-ఆస్ట్రేలియా టికెట్ల విక్రయాలు!

భారత్‌, న్యూజిలాండ్‌ సెమీస్ మ్యాచ్ కోడం ఏసీఏ ఆధ్వర్యంలో విశాఖపట్నం, విజయవాడ, కడప నగరాల్లో భారీ స్క్రీన్లు ఏర్పాట్లు చేస్తున్నారు. బుధవారం మధ్యాహ్నం 1.30 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మ్యాచ్‌ ప్రత్యక్ష ప్రసారం కానుంది. విశాఖ ఆర్కే బీచ్‌లో కాళీమాత గుడి ఎదురుగా, విజయవాడలోని మున్సిపల్‌ స్టేడియంలో, కడపలోని ఆర్ట్స్‌ కాలేజీ మైదానంలో ఏసీఏ అధికారులు స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒక్కో చోట సుమారు 10 వేల మంది వీక్షించనున్నారు. భారీ స్క్రీన్లపై సెమీస్ మ్యాచ్‌ను వీక్షించేందుకు ఉచితం ప్రవేశం కల్పించనున్నారు.

Show comments