Site icon NTV Telugu

Viral Video: ఎలా వస్తాయి భయ్యా ఇలాంటి థాట్స్.. ఏసీ నీటిని ఇలా కూడా ఉపయోగించుకోవచ్చా..?

9w

9w

ప్రస్తుతం వేసవికాలం మొదలైంది. వేసవికాలం వచ్చిందంటే చాలు.. మన దేశంలో అనేక నగరాలకి తాగునీటి సమస్య వచ్చేస్తుంది. వాడుకోవడానికి, తాగడానికి కూడా నీరు లేక నగరవాసులు అలాగే పల్లె ప్రజలు కూడా అనేక తంటాలు పడుతుంటారు. ప్రస్తుతం దేశంలో ఈ పరిస్థితి తక్కువ ఉన్న.. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో మాత్రం నీటి కొరత చాలా ఎక్కువగా ఉంది. అయితే పరిస్థితి ఇలా ఉండగా.. ఓ వ్యక్తి చేసే పని మాత్రం ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. ఇంతకీ ఆ వ్యక్తి ఏం చేసాడంటే.. ఏసీలో నుండి వచ్చే నీటిని ఎలా వాడుకోవాలో ఓ వీడియోని రూపొందించాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Also read: PM MODI : వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన మోడీ..!

ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనందం మహేంద్ర కూడా ఈ వీడియోను వీక్షించిన తర్వాత.. ప్రతి ఒక్కరు కూడా ఇలానే నీటిని సంరక్షించుకోవాలని సూచించారు. ఏసీలు వేసుకున్న సమయంలో అందులోంచి నీరు బయటకు వస్తుందని తెలిసిందే. మనలో చాలామంది నిజానికి ఆ నీటిని వృధానే చేసేస్తుంటాం. కాకపోతే., ఈ వీడియో చేసిన వ్యక్తి మాత్రం నీటిని వృధా చేయకుండా ట్యాప్ ద్వారా స్టోర్ చేస్తున్నాడు. అలా వచ్చిన నీటిని కార్ వాష్, తోట పనికి, అలాగే ఇంట్లో కొన్ని అవసరాలకు వాడొచ్చని తెలుపుతున్నాడు.

Also read: S Jaishankar: సీఏఏపై అమెరికా అత్యుత్సాహం.. దిమ్మతిరిగే సమాధానం ఇచ్చిన జైశంకర్..

నిజానికి ఏసి నుండి వచ్చే నీరు డిస్టిల్ వాటర్ లా ఉంటుంది. ఇలాంటి నీటిని మనం మొక్కల పెంపకానికి బాగా ఉపయోగించుకోవచ్చు. అలాగే వంట సామాన్లు కడగడానికి కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు. ఎండాకాలం కాబట్టి నీటిని పొదుపు చేసుకుని వాడుకోవడం ఉత్తమమైన మార్గం. ఇంకెందుకు ఆలస్యం ఈ వైరల్ వీడియోను మీరు కూడా వీక్షించండి.

Exit mobile version