Delhi High Court: ప్రైవేట్ పార్ట్స్పై గాయాలు లేనంత మాత్రాన లైంగిక దాడి జరగలేదని చెప్పలేం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ మైనర్ బాలిక రేప్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలి రహస్య భాగాలపై గాయాలు లేనంత మాత్రాన ఆమెపై లైంగిక దాడి జరగలేదని భావించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచారం కేసులో పిటిషనర్‌కు కింది కోర్టు విధించిన 12 ఏళ్ల జైలుశిక్షను సమర్థించింది. అంతేకాకుండా పిటిషన్‌ను కొట్టివేసింది. ఢిల్లీలో ఓ చిన్నారిపై లైంగిక దాడి కేసులో దోషిగా తేలి శిక్షపడిన వ్యక్తి.. కింది కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేశాడు. దీంతో పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్‌కు కింది కోర్టు విధించిన 12 ఏళ్ల జైలుశిక్ష, ఐపీసీలోని సెక్షన్ 363 కింద మూడేళ్లు, సెక్షన్ 342 కింద ఆరు నెలల కఠిన ఖైదు శిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. కాగా, పిటిషనర్ 2017లో నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో విచారణ పూర్తిచేసిన కింది కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 12 ఏళ్ల జైలుశిక్ష విధించింది.
Vijay Devarakonda: స్టేజిపై చొక్కా విప్పిన విజయ్.. సమంతను పట్టుకొని
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
మరోవైపు శిక్షపడిన వ్యక్తి కింది కోర్టు తీర్పును సవాల్ చేశాడు. అనంతరం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశాడు. బాధితురాలి ప్రైవేట్ పార్ట్స్‌పై ఎలాంటి గాయాలు లేవని మెడికల్ రిపోర్టులలో తేలిందని, చేయని నేరానికి తనకు శిక్షపడిందని, కాబట్టి తనకు కింది కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని పిటిషనర్ కోరాడు. కానీ, ఢిల్లీ హైకోర్టు అతని పిటిషన్ కొట్టేసింది. బాధితురాలి ప్రైవేట్ పార్ట్స్పై గాయాలు లేనంత మాత్రాన లైంగిక దాడి జరగలేదని భావించలేమని కోర్టు తెలిపింది. ఈ కేసులో మైనర్ బాలిక చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. దోషి తనను ఆయన ఇంటిలోకి తీసుకెళ్లి లోదుస్తులు తొలగించాడని ఆమె పేర్కొన్నది. ఆమె ప్రైవేట్ పార్టుల్లో వేళ్లు చొప్పించాడని, ఆమెకు విపరీతమైన నొప్పి పుట్టిందని వివరించింది. ఆ నేరం చేసిన వ్యక్తినీ బాలిక కోర్టులో గుర్తించిందని తెలిపింది.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!