Site icon NTV Telugu

Delhi High Court: ప్రైవేట్ పార్ట్స్పై గాయాలు లేనంత మాత్రాన లైంగిక దాడి జరగలేదని చెప్పలేం

Delhi

Delhi

ఓ మైనర్ బాలిక రేప్ కేసులో ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బాధితురాలి రహస్య భాగాలపై గాయాలు లేనంత మాత్రాన ఆమెపై లైంగిక దాడి జరగలేదని భావించలేమని ఢిల్లీ హైకోర్టు వ్యాఖ్యానించింది. అత్యాచారం కేసులో పిటిషనర్‌కు కింది కోర్టు విధించిన 12 ఏళ్ల జైలుశిక్షను సమర్థించింది. అంతేకాకుండా పిటిషన్‌ను కొట్టివేసింది. ఢిల్లీలో ఓ చిన్నారిపై లైంగిక దాడి కేసులో దోషిగా తేలి శిక్షపడిన వ్యక్తి.. కింది కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్‌ చేశాడు. దీంతో పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్‌కు కింది కోర్టు విధించిన 12 ఏళ్ల జైలుశిక్ష, ఐపీసీలోని సెక్షన్ 363 కింద మూడేళ్లు, సెక్షన్ 342 కింద ఆరు నెలల కఠిన ఖైదు శిక్షను ఢిల్లీ హైకోర్టు సమర్థించింది. కాగా, పిటిషనర్‌ 2017లో నాలుగున్నరేళ్ల చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ కేసులో విచారణ పూర్తిచేసిన కింది కోర్టు నిందితుడిని దోషిగా నిర్ధారిస్తూ 12 ఏళ్ల జైలుశిక్ష విధించింది.

Vijay Devarakonda: స్టేజిపై చొక్కా విప్పిన విజయ్.. సమంతను పట్టుకొని

మరోవైపు శిక్షపడిన వ్యక్తి కింది కోర్టు తీర్పును సవాల్‌ చేశాడు. అనంతరం ఢిల్లీ హైకోర్టులో పిటిషన్‌ వేశాడు. బాధితురాలి ప్రైవేట్‌ పార్ట్స్‌పై ఎలాంటి గాయాలు లేవని మెడికల్‌ రిపోర్టులలో తేలిందని, చేయని నేరానికి తనకు శిక్షపడిందని, కాబట్టి తనకు కింది కోర్టు విధించిన శిక్షను రద్దు చేయాలని పిటిషనర్‌ కోరాడు. కానీ, ఢిల్లీ హైకోర్టు అతని పిటిషన్‌ కొట్టేసింది. బాధితురాలి ప్రైవేట్‌ పార్ట్స్‌పై గాయాలు లేనంత మాత్రాన లైంగిక దాడి జరగలేదని భావించలేమని కోర్టు తెలిపింది. ఈ కేసులో మైనర్ బాలిక చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ హైకోర్టు ఈ సందర్భంగా ప్రస్తావించింది. దోషి తనను ఆయన ఇంటిలోకి తీసుకెళ్లి లోదుస్తులు తొలగించాడని ఆమె పేర్కొన్నది. ఆమె ప్రైవేట్ పార్టుల్లో వేళ్లు చొప్పించాడని, ఆమెకు విపరీతమైన నొప్పి పుట్టిందని వివరించింది. ఆ నేరం చేసిన వ్యక్తినీ బాలిక కోర్టులో గుర్తించిందని తెలిపింది.

Exit mobile version