NTV Telugu Site icon

Catholic Church : చర్చిలో చిన్నారులపై లైంగిక వేధింపులు.. మతపెద్దలే నిందితులు

Church

Church

Catholic Church : పోర్చుగీస్‌లోని క్యాథలిక్‌ చర్చిలో దాదాపు 5వేల మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లుగా నిపుణుల కమిటీలో నిర్ధారణ అయింది. క్రైస్తవ మతపెద్దలే చిన్నారులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నిర్ధారణ అయ్యింది. 4,815మంది చిన్నారులపై లైంగిక వేధింపులకు గురైనట్లు సమాచారం. ఈ చిన్నారుల్లో ఆడపిల్లల కంటే మగపిల్లలే ఎక్కువమంది బాధితులుగా ఉన్నారని తేలింది.

Read Also: Guinness World Record: లిప్ కిస్ పెట్టుకున్నారు.. వరల్డ్ రికార్డ్ కొట్టారు

పోర్చుగల్ లోనే అతిపెద్ద క్యాథలిక్‌ చర్చిలో చిన్నారులపై లైంగిక వేధింపుల వ్యవహారంపై ఓ కమిటీ వేయగా ఫిబ్రవరి 13,2023 న కమిటీ ఇచ్చిన రిపోర్టులో ఈ దారుణ విషయాలు బయటపడ్డాయి. 70ఏళ్లలో క్యాథలిక్ చర్చిలో 4,815 మంది చిన్నారులు లైంగికంగా వేధింపులకు గురిఅయ్యారని నలుగురు మానసిక నిపుణులు, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ఓ సామాజిక కార్యకర్త నేతృత్వంలో ఏర్పాటు చేసిన స్వతంత్ర కమిటీ తేల్చింది. ఈ వేధింపులకు పాల్పడినవారిలో 77 శాతం మంది చర్చి మతపెద్దలే ఉన్నారని నివేదిక వెల్లడించింది.

Read Also: Demolition Drive: అధికారుల అత్యుత్సాహం.. తల్లీకూతుళ్ల సజీవదహనం