Railway Vacancies: రైల్వేలో ఖాళీల సంఖ్య 2.74 లక్షలు.. భద్రతా విభాగంలోనే 1.7లక్షల పోస్టులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Railway Vacancies: రైల్వే శాఖలో ఉన్న ఖాళీలరై కీలక విషయం తెలిసింది. రైల్వేలో 2.74 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయయని రైల్వే మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అందులో 1.7 లక్షలకు పైగా భద్రత విభాగంలోనే ఉన్నాయని పేర్కొంది. ఓ ఆర్టీఐ కార్యకర్త సమాచార హక్కు చట్టం కింద చేసిన దరఖాస్తుకు బదులుగా రైల్వేశాఖ ఈ వివరాలు వెల్లడించింది. సమాచార హక్కు చట్టం కింద మధ్యప్రదేశ్‌కు చెందిన చంద్ర శేఖర్ గౌర్ అనే సామాజిక కార్యకర్త చేసిన దరఖాస్తుకు బదులుగా రైల్వేశాఖ ఈ వివరణ ఇచ్చింది. గ్రూప్ సీ, లెవల్ 1, ఎంట్రీ లెవల్ కేటగిరీల్లో 2023 జూన్ 1 నాటికి మొత్తం 2,74,580 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ వెల్లడించింది.
Also Read: Naukri.com: భారతీయ ఉద్యోగులకు 10శాతం ఇంక్రిమెంట్.. సర్వేలో వెల్లడి
Also Read
- Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
- Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
- మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో 'కాజూ కట్లీ' తయారీ చేయండి ఇలా.!
- Asim Munir: పాకిస్థాన్ మళ్లీ యుద్ధానికి సిద్ధమవుతోందా? ఆయుధ కర్మాగారాన్ని సందర్శించిన మునీర్..
ఇందులో భద్రత కేటగిరికీ సంబంధించిన ఖాళీలు 1,77,924 ఉన్నట్లు తెలిసింది. జూన్ 1 తేదీ నాటికి నాన్‌గెజిటెడ్ గ్రూప్ సీలో 2,74,580 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు రైల్వే శాఖ తెలిపింది. ఇక రైల్వేల భద్రతకు సంబంధించి 9.82 లక్షలకు పైగా ఉద్యోగాలు ఖాళీగా ఉంటే .. అందులో 8.04 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసినట్లు రైల్వే శాఖ వెల్లడించింది. డైరెక్ట్ రిక్రూట్మెంట్, వేగవంతమైన పదోన్నతులు, శిక్షణ తర్వాత ప్రధాన ఉద్యోగాలకు నాన్-కోర్ సిబ్బందిని తరలించడం వంటి చర్యల ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు రైల్వే అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ వెల్లడించారు. రైల్వేలో 3.12 లక్షల నాన్ గెజిటెడ్ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు 2022 డిసెంబర్లో పార్లమెంట్ వేదికగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు.
Also Read: Best Mileage Bike 2023: స్టైల్లోనే కాదు మైలేజ్‌లోనూ కింగే.. ఈ బైక్ ధర కేవలం 54 వేలు మాత్రమే!
భద్రతా కేటగిరీలో లోకో పైలట్లు, ట్రాక్పర్సన్లు, పాయింట్‌మెన్, ఎలక్ట్రికల్ వర్క్‌లు, సిగ్నల్, టెలికాం అసిస్టెంట్లు, ఇంజనీర్లు, టెక్నీషియన్లు, క్లర్క్‌లు, గార్డ్లు/ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్లు, టిక్కెట్ కలెక్టర్లు వంటి పోస్టులు ఉన్నాయి. వారందరూ రైల్వే భద్రత విభాగంలో పనిచేస్తారు. వీరంతా ప్రత్యక్షంగా రైల్వే కార్యకలాపాల్లో పాల్గొంటారు. ఇలాంటి కీలక పోస్టుల్లో కొరత ఉండటంపై రైల్వే యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. వీటిని తగిన స్థాయిలో భర్తీ చేయకపోడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ట్రాక్ మెయింటెనెన్స్, ఫిట్నెస్, సీనియర్ జూనియర్ సెక్షన్ ఇంజనీర్లు, గ్యాంగ్‌మెన్, టెక్నీషియన్లలో మరిన్ని పోస్టులను మంజూరు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాయి.
తాజావార్తలు
-
Bhakthi Anniversary Special: రెండు దశాబ్దాల ఆధ్యాత్మిక ప్రయాణం.. భక్తి టీవీ ప్రత్యేక గీతం మీకోసం.!
-
GV Prakash : సుధా కొంగర సినిమాకు నో చెప్పిన మహేశ్ బాబు
-
Bhopal Murder: భర్త, భార్య, ప్రియురాలు, మాజీ ప్రియుడు.. ఈ హత్య కేసులో ట్విస్టులే ట్విస్టులు!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
BCCI-Team India: ఉన్నపళంగా బెంగళూరుకు టీమిండియా స్టార్ క్రికెటర్లు.. ఎందుకో తెలుసా?
ట్రెండింగ్
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!