గర్భస్రావం చేయించుకోవడంలో మహిళలు అనేక సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. ఉదాహరణకు, ఒక మహిళ గర్భస్రావం చేయించుకోవడానికి ఆసుపత్రికి వెళితే, ఆమెను చాలా ప్రశ్నలు అడుగుతారు. కారణం తెలియకుండా చేయడానికి చాలా ఆసుపత్రులు నిరాకరిస్తాయి. ఇదిలా ఉండగా.. అత్యధిక విద్యావంతులు ఉన్న రాష్ట్రంలో మాత్రం గర్భస్రావం కేసులు క్రమంగా పెరుగుతున్నాయి.
READ MORE: Kartik Maharaj: 6 నెలల్లో 12 సార్లు అత్యాచారం.. పద్మశ్రీ అవార్డు గ్రహీతపై ఆరోపణలు..
హెల్త్ మేనేజ్‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (HMIS) ప్రకారం.. కేరళలో గత 9 సంవత్సరాలలో గర్భస్రావ కేసులు 76% కంటే ఎక్కువగా పెరిగాయి. ఈ నివేదిక ప్రకారం.. 2014-15లో మొత్తం 17,025 గర్భస్రావాలు జరిగాయి. 2023-24లో దాదాపు 30,000 గర్భస్రావ కేసులు నమోదయ్యాయి. వీటిలో 21,282 కేసులు ప్రైవేట్ ఆసుపత్రులలో నమోదయ్యాయి. 8,755 కేసులు మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో నమోదయ్యాయి. 2015-16 నుంచి 2024-25 వరకు, కేరళలో మొత్తం 1,97,782 గర్భస్రావాలు నమోదయ్యాయి. వీటిలో 67,004 మాత్రమే ప్రభుత్వ ఆసుపత్రులలో నమోదయ్యాయి. మిగతా 1,30,778 మొత్తం గర్భస్రావాలు ప్రైవేట్ ఆసుపత్రులలో చేయించారు. ఇందులో మహిళల ఇష్టపూర్వకంగా, ఇష్టం లేకుండా చేసిన గర్భస్రావాలు రెండూ ఉన్నాయి.
చాలా మంది గర్భస్రావాలను తప్పుగా చూస్తారు. వాస్తవానికి, చాలా గర్భస్రావాలు మహిళల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని జరుగుతాయని వైద్యులు చెబుతున్నారు. కానీ కొన్ని గర్భస్రావాలు మాత్రం బలవంతంగా చేయిస్తారు. కొందరు పెళ్లికి ముందే తప్పటడుగు వేసి గర్భం దాల్చిన వాళ్లు కూడా ఉంటారు. గర్భస్రావం కోసం ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులను ఎంచుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ఆసుపత్రులపై ఆధారపడటం పెరగడానికి ప్రధాన కారణం గోప్యత అని వెల్లడిస్తున్నారు. అంటే.. ప్రైవేట్‌లో చేయించుకుని ఎవ్వరికీ తెలియకుంగా జాగ్రత్తపడతారు. ఏదేమైనా అత్యధిక అక్షరాస్యత ఉన్న రాష్ట్రాల్లో ఒకటైన కేరళలో గర్భస్రావం కేసులు పెరగడం ఆందోళన కరమే అని నిపుణులు చెబుతున్నారు.
