Site icon NTV Telugu

Search Operation: మహారాష్ట్రలో తెలంగాణ ఆబ్కారీ అధికారుల భారీ ఆపరేషన్

Abkari

Abkari

Search Operation: మహారాష్ట్రలో తెలంగాణ ఆబ్కారీ అధికారుల భారీ ఆపరేషన్ చేసారు. కల్తీకల్లు కోసం ఉపయోగించే క్లోరోహైడ్రేట్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు మహారాష్ట్రకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. అక్కడే నాలుగు రోజులు నిఘావేసి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. గత తొమ్మిది నెలలుగా పరారీలో ఉన్న ఇద్దరు నిందితులును సైతం అదుపులోకి తీసుకున్నారు ఆబ్కారి అధికారులు. ఈ ఏడాది జనవరిలో 560 కిలోల క్లోరోహైడ్రేట్ ను స్వాధీనం చేసుకున్నారు ఆబ్కారి శాఖ అధికారులు.

Ratan Tata: ఆర్థిక ప్రగతికి మానవత్వాన్ని అద్దిన అరుదైన పారిశ్రామిక వేత్త రతన్ టాటా: కేసీఆర్

రామ గౌడ్ అనే ప్రధాన నిందితుల్ని అరెస్టు చేసి రిమాండ్ కు పంపించారు అధికారులు. రామా గౌడ్ ను కస్టడీ లోకి తీసుకొని విచారించిన అధికారులకు మహారాష్ట్ర లింక్ దొరికింది. దీంతో ప్రత్యేక టీములు మహారాష్ట్రకు వెళ్లి ఇద్దరు ప్రధాన నిందితులను అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Ratan Tata Love Story : విషాదంగా రతన్ టాటా లవ్ స్టోరీ.. ఆమె కోసమే ఆయన పెళ్లి చేసుకోలేదా?

Exit mobile version