Tuni Minor Rape: దూకిన మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు తుని కోమటి చెరువులోకి దూకాడు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకొని వెళ్తుండగా నారాయణ రావు వాష్ రూమ్ కోసం వెహికల్ ఆపమన్నాడని పోలీసులు చెబుతున్నారు. పోలీస్ వెహికల్ ఆగిన వెంటనే తప్పించుకుని సమీపంలో ఉన్న చెరువులో దూకాడని పోలీసుల తెలిపారు. నారాయణరావు ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.
Search Operation: మహారాష్ట్రలో తెలంగాణ ఆబ్కారీ అధికారుల భారీ ఆపరేషన్ చేసారు. కల్తీకల్లు కోసం ఉపయోగించే క్లోరోహైడ్రేట్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకునేందుకు మహారాష్ట్రకు ప్రత్యేక బృందాలు వెళ్లాయి. అక్కడే నాలుగు రోజులు నిఘావేసి తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు పోలీసులు. గత తొమ్మిది నెలలుగా పరారీలో ఉన్న ఇద్దరు నిందితులును సైతం అదుపులోకి తీసుకున్నారు ఆబ్కారి అధికారులు. ఈ ఏడాది జనవరిలో 560 కిలోల క్లోరోహైడ్రేట్ ను స్వాధీనం చేసుకున్నారు…