Abhishek Sharma: విధ్వంసం స్పష్టించిన కాటేరమ్మ కొడుకు.. 91 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి..

Abhishek Sharma

Abhishek Sharma

భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ స్థానిక వన్‌డే డిస్ట్రిక్ట్ టోర్నీలో పరుగుల విధ్వంసం సృష్టిస్తూ సంచలన ఇన్నింగ్స్ ఆడాడు. అమృత్‌సర్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ, తరన్ తారన్ మెన్స్ సీనియర్ టీమ్‌పై జరిగిన మ్యాచ్‌లో కేవలం 91 బంతుల్లోనే 15 ఫోర్లు, 25 సిక్సర్ల సాయంతో 233 రన్స్ చేసి అద్భుతమైన డబుల్ సెంచరీతో విరుచుకుపడ్డాడు. అభిషేక్ సిక్సర్ల తుఫాన్ ధాటికి అమృత్‌సర్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి ఏకంగా 533 పరుగుల కొండంత స్కోరును సాధించింది.

ఇటీవల జింబాబ్వేతో జరిగిన అంతర్జాతీయ మ్యాచ్‌లలో కేవలం 1, 8, 2 పరుగులు మాత్రమే చేసి తీవ్రంగా విఫలమైన అభిషేక్, విమర్శకుల నోళ్లు మూయిస్తూ ఈ రీతిలో ఫామ్‌లోకి వచ్చాడు. తన బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకుని మైదానం నలుమూలలా బాదిన షాట్ల వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

త్వరలో జరగబోయే ఆసియా టోర్నీలతో పాటు రాబోయే కీలక మ్యాచ్‌ల ముంగిట ఈ తరహా అద్భుత ప్రదర్శన చేయడం అతని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. టీమిండియాలో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకోవడమే లక్ష్యంగా అభిషేక్ శర్మ తీవ్రంగా శ్రమిస్తున్నాడని ఈ ఇన్నింగ్స్ నిరూపిస్తోంది.