Site icon NTV Telugu

Abhishek Sharma: తొలి భారత క్రికెటర్‌గా అభిషేక్ శర్మ అరుదైన రికార్డు!

Abhishek Sharma

Abhishek Sharma

ఆసియా కప్ 2025లో భాగంగా బుధవారం యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌ చేసిన యూఏఈ 57 పరుగులకే ఆలౌటైంది. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని భారత్ మరో 93 బంతులు మిగిలిఉండగానే విజయం సాధించింది. అభిషేక్ శర్మ (30: 16 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), శుభ్‌మన్ గిల్‌ (20 నాటౌట్)లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్ ద్వారా అభిషేక్ ఓ అరుదైన రికార్డును ఖాతాలో వేసుకున్నాడు.

టీ20ల్లో లక్ష్య ఛేదనలో మొదటి బంతికే సిక్స్‌ కొట్టిన తొలి భారత బ్యాటర్‌గా అభిషేక్ శర్మ అరుదైన ఘనత ఖాతాలో వేసుకున్నాడు. యూఏఈ బౌలర్ హైదర్ అలీ వేసిన తొలి బంతినే సిక్స్‌గా మలిచి ఈ ఫీట్ అందుకున్నాడు. 2021కి ఇంగ్లండ్‌పై రోహిత్ శర్మ, 2024లో జింబాబ్వేపై యశస్వి జైస్వాల్, 2025లో ఇంగ్లండ్‌పై సంజు శాంసన్ తొలి బంతినే సిక్స్‌గా మలిచినా.. వీరంతా భారత్ తొలుత బ్యాటింగ్‌ చేసినప్పుడు కొట్టారు.

మొదటి బంతికే సిక్స్ కొట్టిన భారత బ్యాట్స్‌మెన్ లిస్ట్:
రోహిత్ శర్మ vs ఆదిల్ రషీద్, అహ్మదాబాద్, 2021
యశస్వి జైస్వాల్ vs సికందర్ రజా, హరారే, 2024
సంజు శాంసన్ vs జోఫ్రా ఆర్చర్, ముంబై, 2025
అభిషేక్ శర్మ vs యుఏఈ, దుబాయ్, 2025

Exit mobile version