Abhishek Sharma: ఐదు మ్యాచ్‌ల T20 సిరీస్‌లో భాగంగా భారత జట్టు నవంబర్ 8వ తేదీన బ్రిస్బేన్‌లోని గబ్బాలో ఆస్ట్రేలియాతో చివరి మ్యాచ్ ఆడింది. ఆస్ట్రేలియా కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు బ్యాటింగ్ బరిలోకి దిగింది. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలోని టీమిండియా శుభారంభం చేశారు. ఓపెనర్లు శుభ్‌మాన్ గిల్, అభిషేక్ శర్మ అద్భుత ఆరంభాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో రికార్డు సృష్టించాడు. అభిషేక్ అంతర్జాతీయ టీ20లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
READ MORE: CM Chandrababu : 48 మంది ఎమ్మెల్యేలపై సీఎం చంద్రబాబు సీరియస్.. నోటీసులకు ఆదేశం
అభిషేక్ శర్మ అంతర్జాతీయ టీ20ల్లో తక్కువ బంతుల్లో 1,000 పరుగులు చేసిన బ్యాట్స్‌మన్ గా నిలిచాడు. 528 బంతుల్లో వెయ్యి పరుగులు సాధించాడు. భారత T20I కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 573 బంతుల్లో 1,000 పరుగులు చేయగా.. సుర్య రికార్డును అభిషేక్ బద్దలుగొట్టాడు.
తక్కువ బంతుల్లో 1,000ల పరుగులు సాధించిన ప్లేయర్లు..
528 బంతులు- అభిషేక్ శర్మ (భారత్)
573 బంతులు- సూర్యకుమార్ యాదవ్ (భారత్)
599 బంతులు- ఫిల్ సాల్ట్ (ఇంగ్లాండ్)
604 బంతులు- గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా)
609 బంతులు- ఆండ్రీ రస్సెల్ (వెస్టిండీస్)/ఫిన్ అలెన్ (న్యూజిలాండ్)