Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
- అభిజీత్ దీప్కే ఇంట్లో విషాదం
- ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చేసిన తర్వాత ఘటన
- విషాదంలో కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఢిల్లీలో అభిజీత్ దీప్కేను అరెస్ట్ చేసిన కొద్దిసేపటికే మహారాష్ట్రలో విషాదం చోటుచేసుకుంది. అభిజీత్ దీప్కే నానమ్మ సావిత్రీబాయి దీప్కే (85) హింగోలి జిల్లాలో కన్నుమూశారు. ఢిల్లీలో దీప్కే, ఆయన సహచరులను పోలీసులు అదుపులోకి తీసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం విశేషం. సావిత్రీబాయి మృతి వార్త తర్వాత దీప్కే తల్లిదండ్రులు హింగోలికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
సీఈసీ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ అక్టోబర్ 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర నిరసనకు పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఢిల్లీకి చేరుకున్న అభిజీత్ దీప్కే, ఆయన సహచరులను విమానాశ్రయంలో ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీప్కే ఇన్స్టాగ్రామ్ లైవ్ సందర్భంగా రికార్డయినట్లు చెబుతున్న ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో మహిళా పోలీసు సిబ్బందితో సహా పలువురు పోలీసులు విమానంలోకి వచ్చి ఆయన దగ్గరకు వెళ్లడం కనిపించింది. ఈ సమయంలో దీప్కే.. “ఢిల్లీ పోలీసులు విమానంలోకి వచ్చారు. మమ్మల్ని అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు” అని చెప్పినట్లు వీడియోలో వినిపిస్తోంది. దీప్కేతో పాటు సీజేపీ కార్యకర్తలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను కూడా విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
Also Read
- Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
- Delhi Protest: కన్నాట్ ప్లేస్‌లో హైటెన్షన్.. పోలీసులపై రాళ్లు రువ్విన నిరసనకారులు..!
- Abhijit Dipke: అరెస్టుకు ముందే వీడియో.. ఉద్యమానికి కొత్త నాయకుడిని ప్రకటించిన అభిజీత్ దీప్కే!
- Mamata Banerjee: "జానీ జానీ ఎస్ పప్పా.. జ్ఞానేశ్ కుమార్ నో పప్పా!".. ఢిల్లీలో మమతా బెనర్జీ హల్చల్
జంతర్ మంతర్ దగ్గర నిర్వహించనున్న నిరసనకు ఎన్నికల సంఘం వ్యవహారశైలే ప్రధాన కారణమని సీజేపీ తెలిపింది. ఎన్నికల సంఘం దుర్వ్యవహారానికి పాల్పడుతోందని ఆరోపిస్తూ.. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో నిరసనకు హాజరయ్యేందుకు వచ్చిన దీప్కే, ఇతర కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!